విజయవాడ: ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను
విజయవాడ: ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని పీవీపీ చెప్పారు. టీడీపీ నేతలు కావాలనే తనపై బురద జల్లుతున్నారని పీవీపీ అన్నారు. స్పెషల్ స్టేటస్ బోరింగ్ సబ్జెక్ట్ అని తాను అనలేదన్నారు. తాను ఎలాంటి వాడినో విజయవాడ ప్రజలకు బాగా తెలుసు అన్నారు. తన స్పీచ్ మొత్తం వింటే అందరికి క్లారిటీ వస్తుందన్నారు. తన స్పీచ్ 5 నిమిషాలు ఉంటే.. అందులో కొన్ని పదాలు కట్ చేసి వక్రీకరించారని పీవీపీ ఆరోపించారు. గార్డియన్స్ ఆఫ్ సొసైటీగా భావించే మీడియానే.. ఇలాంటి పనులు చేయడం బాధాకరం అని పీవీపీ వాపోయారు.
Read Also : జేడీని చూడగానే జగన్ కు దడ.. వైసీపీ కబ్జాల నుంచి ఆయన కాపలా : పవన్
సీఎం చంద్రబాబు తన గురించి చేసిన విమర్శలపై పీవీపీ స్పందించారు. టీడీపీ నేతలు సీఎంకి సరిగ్గా బ్రీఫ్డ్ చేసినట్టు లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి ఇంగ్లీష్ బాగా వస్తుందని.. కావాలంటే సీఎం చంద్రబాబు.. ఆయన ద్వారా తాను ఇంగ్లీష్ లో ఏం మాట్లాడానో అడిగి తెలుసుకోవాలని పీవీపీ సూచించారు. ప్రత్యేక హోదా గురించి తప్పుగా మాట్లాడిన పీవీపీ తన బీ ఫామ్ వెనక్కి తీసుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపైనా పీవీపీ రియాక్ట్ అయ్యారు. ప్రత్యేక హోదా గురించి తాను తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ గురించి చాలా మంది మాట్లాడారని.. వారందరిని కూడా బీఫామ్ వెనక్కి తీసుకోవాలని కోరాలని రామకృష్ణకు సూచించారు.
‘ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్’ అంటూ సీఐఐ సదస్సులో పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పీవీపీ చేసినట్టుగా చెబుతున్న ఆ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పీవీపీ వ్యాఖ్యలపై టీడీపీ, సీపీఐ నేతలు ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలకు ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్‌గా అనిపిస్తోందా? అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ బాటలో జగన్ వెళుతున్నారని, జగన్ మాటే పీవీపీ నోట వచ్చిందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల పీవీపీకి ఏమాత్రం అవగాహన లేదని.. పీవీపీ అసలు రాజకీయాలకు అనర్హుడని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజలందరూ పీవీపీ అభ్యర్ధిత్వాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన పట్ల జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణం విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ చేశారు.
Read Also : సత్తా ఏంటో చూపిస్తానంటున్న పవన్