Rahul Disqualification: అనర్హత వేటుపై రాహుల్ గాంధీ తొలి రియాక్షన్ ఇదే..

అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుంచి రాహుల్ తప్పించుకోగలరు. ఒకవేళ అలా జరక్కపోతే రానున్న 8ఏళ్ల పాటు పార్లమెంట్‭లో అడుగు పెట్టలేరు

Rahul Disqualification: పార్లమెంటు సభ్యుడి హోదా పోవడమే కాకుండా, ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు విధిస్తూ లోక్‭సభ సెక్రెటేరియన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం.. రాహుల్ గాంధీ మొదటిసారిగా స్పందించారు. తాను దేశం కోసం పోరాడుతున్నానని, అందుకు ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘నేను భారతదేశ గొంతులు వినిపించడానికి పోరాడుతున్నాను. అందుకోసం ఎంత వరకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాను’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో దోషిగా తేలడంతో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత వేటు (disqualification) వేశారు. “కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్‌సభ సెక్రటేరియట్ ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Rahul Disqualification: అనర్హత వేటు ఎందుకు పడుతుంది? రాహుల్ గాంధీ విషయంలో ఏం జరిగింది?

అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుంచి రాహుల్ తప్పించుకోగలరు. ఒకవేళ అలా జరక్కపోతే రానున్న 8ఏళ్ల పాటు పార్లమెంట్‭లో అడుగు పెట్టలేరు. సెషన్స్ కోర్టు, హైకోర్టు కాకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా రాహుల్ గాంధీకి ఆర్టికల్ 136 కల్పిస్తుంది. దేశంలోని అన్ని కోర్టులు, ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పును రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

ట్రెండింగ్ వార్తలు