Nara Lokesh: నేషనల్ పాలిటిక్స్‌లో లోకేశ్ కు పెరుగుతున్న ఇంపార్టెన్స్.. దేనికి సంకేతం? ఎందుకీ ఎలివేషన్?
ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్‌లైట్‌లో ఉంటున్నారు.
Nara Lokesh: పార్టీ ప్రోగ్రామ్ అయినా..జాతీయ స్థాయిలో ఏ మీటింగ్ అయినా..ఈవెంట్ ఏదైనా. ఆయనకు ఇన్విటేషన్ పక్కా. టీడీపీ భవిష్యత్ నేతగా..ఏపీ ఫ్యూచర్ సీఎం క్యాండిడేట్‌గా ఎక్స్‌పోజ్ అవుతున్న నారా లోకేశ్‌కు..నేషనల్ పాలిటిక్స్‌లో ఇంపార్టెన్స్ పెరుగుతోంది. బీజేపీనే కాదు..ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా లోకేశ్‌కు స్పెషల్ ఇన్విటేషన్‌లు పంపుతూ ఆయనకు ఇంకా హైప్ ఇస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో లోకేశ్ రోల్ కీలకం కాబోతోందా? బీజేపీతో సహా నేషనల్ పార్టీల నేతలతో లోకేశ్‌కు ర్యాపో పెరుగుతోందా?
చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించేది లోకేశే. కాలం కలిసి వస్తే సీఎం అయ్యేది కూడా ఆయనే. ఏపీ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఈ విషయంలో క్లియర్ కట్ క్లారిటీ ఉంది. అయితే బీజేపీతో సహా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా లోకేశ్ విషయంలో స్పష్టతకు వచ్చారట. చంద్రబాబు తర్వాత టీడీపీ రథసారధి అయ్యేది లోకేశే. ప్రాంతీయ పార్టీలో వారసుడే ఫ్యూచర్ లీడర్. టీడీపీ పగ్గాలు చేపట్టేది కూడా లోకేశ్. పైగా టీడీపీ..బీజేపీ అలయన్స్ టీమ్. మనోడు..యువ నాయకుడు అంటూ అన్ని పార్టీలు లోకేశ్‌ను కలుపుకుని వెళ్తున్నాయట.
ఏపీ ప్రభుత్వంలో అయినా..టీడీపీలో అయినా..ఆయనే హైలెట్. మొన్న గూగుల్ డేటా సెంటర్ అగ్రిమెంట్‌లో..లేటెస్ట్‌గా సీఐఐ సదస్సులో..ఇప్పుడు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటనలో ఎక్కడైనా యువనేతే ముందుంటున్నారు. ఏపీ సర్కార్ అఫీషియల్ వాయిస్‌గా కీలక స్టేట్‌మెంట్లు ఇస్తూ..ఆచితూచి మాట్లాడుతూ ఫ్యూచర్ లీడర్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఓవైపు మంత్రిగా..మరోవైపు టీడీపీ కీలక నేతగా లోకేశ్ చుట్టే చర్చ జరుగుతోంది. ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్‌లైట్‌లో ఉంటున్నారు. ఇదే టైమ్‌లో లోకేశ్ ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఈ 15 నెలల కాలంలో ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురిని కలిశారు.
సీఎం చంద్రబాబుతో కలిసి హస్తినకు వెళ్లి సెంట్రల్ మినిస్టర్లను కూడా కలుస్తారని అంటున్నారు. ఇలా టీడీపీ ఫ్యూచర్ లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తోన్న లోకేశ్.. కేంద్ర పెద్దలతోనే మంచి రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్నారు. బీజేపీ అ్రగ నేతలుగా ఉన్నా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కూడా లోకేశ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. సేమ్ టైమ్ బీజేపీ భాగస్వామ్య పార్టీల నేతలతోనే ర్యాపో పెంచుకుంటున్నారట లోకేశ్. పనిలో పనిగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లోకేశ్‌ను నేషనల్ లీడర్లకు దగ్గర చేస్తున్నారట చంద్రబాబు.
భవిష్యత్ లీడర్‌గా నేషనల్ లెవల్ ఎలివేషన్..
నేషనల్ పాలిటిక్స్‌లో చంద్రబాబు వెల్ నోన్ పొలిటీషియన్. ఇక నెక్స్ట్ లోకేశ్‌ను భవిష్యత్ లీడర్‌గా నేషనల్ లెవల్ ఎలివేషన్ ఇస్తున్నారట. ఫ్యూచర్ పాలిటిక్స్‌లో కింగ్ మేకర్‌గా..కీ రోల్ ప్లే చేసేంత పట్టు ఉండాలంటే బీజేపీ పెద్దలతో, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలతో మంచి సంబంధాలు అవసరమని భావిస్తున్నారట. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పటికీ..లోకేశ్ ఇప్పుడే ఫుల్ యాక్టీవ్‌గా ఉంటున్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు..కేంద్రం పెద్దలతో పొలిటికల్ లాబీయింగ్ కూడా చేస్తున్నారట. ఇప్పటికే మోదీతో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై డిస్కస్ చేశారు.
ఇక ఇటీవల బిహార్ ఎన్నికలప్పుడు ఎన్డీఏ తరఫున ప్రచారానికి వెళ్లారు లోకేశ్. ఇప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథిగా అటెండ్ అయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఆహ్వానం సహజమే అయినప్పటికీ మంత్రి లోకేశ్‌కు స్పెషల్ ఇన్విటేషన్ రావడం చర్చనీయాంశం అవుతోంది. బిహార్ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబుకు బదులుగా నారా లోకేశ్ పట్నాలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు.
బిహార్ ప్రచారంతో లోకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇక ఎన్డీఏలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీ నేతలు హాజరు కావడం కామన్. ఏదైన రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు రావడం కూడా పరిపాటే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందడం రొటీనే.
జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే పరిస్థితులు..
లోకేశ్‌కు ప్రత్యేకంగా ఇన్విటేషన్ రావడం..ఆయణ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమే ఆసక్తికరంగా మారింది. ఇది లోకేశ్‌కు దక్కుతున్న ప్రయారిటీ అంటూ టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తోంది. ప్రధాని ఆల్రెడీ లోకేశ్‌ను ప్రోత్సహిస్తున్నారని..ఢిల్లీకి రమ్మని ప్రత్యేకంగా పిలిపించుకోవడమే కాకుండా, అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే రానున్న రోజుల్లో లోకేశ్ జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
Also Read: ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు.. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి
