Rahul Gandhi vacates official residence at NewDelhi
Rahul Gandhi: లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడడంతో ఎట్టకేలకు తన అధికారిక నివాసాన్ని కీలక నేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో ఉన్న ఆ భవనంలో రాహుల్ 2005 నుంచి ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. తాజాగా గడువు ముగియడంతో శనివారం తన బంగళాను రాహుల్ ఖాళీ చేశారు. 18 ఏళ్ల పాటు ఆ బంగళాలో ఉన్న రాహుల్ గాంధీ.. మొదటి సారి అక్కడి నుంచి బయటికి వెళ్లారు. అయితే బంగళా తాళాలను లోక్‌సభ హౌసింగ్ కమిటీకి సాయంత్రం అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
అనర్హత వేటు పడిన ఎంపీకి ప్రభుత్వ వసతికి అర్హత ఉండదు. అయితే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల వ్యవధి ఉంటుంది. ఇక సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసేందుకు 30 రోజులు గడువు ఇవ్వగా.. శుక్రవారం ఈ కేసులో రాహుల్ ఓడిపోయారు. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం తిరిగి పొందలేకుండా పోయింది. ఇక దీనిపై గుజరాత్ హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించేందుకు అవకాశం ఉంది.
Andhra Pradesh : మంత్రి సురేష్‍ను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసింది అందుకే అలా చేశారు : నక్కా ఆనందబాబు
2019 నాటి పరువు నష్టం కేసులో మోదీ ఇంటిపేరు ఉన్న వ్యక్తులు దొంగలు అంటూ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యానించడంపై నమోదైన కేసును విచారించిన గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు, రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించబడింది. ఇక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీకి తమ ఇంట్లో చోటు ఇస్తామంటే, తమ ఇంట్లో ఇస్తామంటూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆఫర్లు చేశారు. అయితే రాహుల్ గాంధీ.. సెంట్రల్ ఢిల్లీలోని 10 జనపథ్‌లో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బంగ్లాకు మారనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ మీద భారతీయ జనతా పార్టీ ప్రతీకారం తీర్చుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.