Rajasthan Political Crisis: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం అశోక్ గెహ్లాట్ సమావేశం

రాజస్తాన్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ సహా ట్రబుల్ షూటర్ ఏకే ఆంటోనిలను అధిష్టానం పంపిస్తోంది. ముందుగా అనుకున్నట్టే పైలట్‭కు రాజస్తాన్ సీఎం పదవిని కట్టబెట్టి పార్టీ అధ్యక్ష పదవికి మరొక వ్యక్తిని చూడాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ రాజకీయంపై తనకు మద్దతుగా ఉన్న నేతలతో ముఖ్యమంత్రి నివాసంతో గెహ్లాట్ సమావేశయ్యారు.

Rajasthan Political Crisis: రాజస్తాన్ రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొద్ది మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గెహ్లాట్‭కు అవకాశం ఇస్తూనే సచిన్ పైలట్‭ను రాజస్తాన్ సీఎం చేయాలని అధిష్టానం అనుకోగా.. దానికి గెహ్లాట్ మోకాలడ్డారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాజీనామా చేపించి చక్రం తిప్పుదామనుకున్న ఆయనకు అధిష్టానం షాకిచ్చింది.

అధ్యక్ష బరి నుంచి తప్పించడంతో పాటు రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి సైతం తొలగించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన గెహ్లాట్ ఈ రకంగా వ్యవహరిస్తారని అధిష్టానం ఊహించలేదు. అలాగే తన పంతం నెగ్గించుకోవడానికి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం వల్ల తనకే ఎదురుదెబ్బ తగులుతుందని కూడా గెహ్లాట్ ఊహించలేదు. అటు సోనియాకు ఇటు గెహ్లాట్‭కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.

రాజస్తాన్ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ సహా ట్రబుల్ షూటర్ ఏకే ఆంటోనిలను అధిష్టానం పంపిస్తోంది. ముందుగా అనుకున్నట్టే పైలట్‭కు రాజస్తాన్ సీఎం పదవిని కట్టబెట్టి పార్టీ అధ్యక్ష పదవికి మరొక వ్యక్తిని చూడాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ రాజకీయంపై తనకు మద్దతుగా ఉన్న నేతలతో ముఖ్యమంత్రి నివాసంతో గెహ్లాట్ సమావేశయ్యారు.

Karnataka: 6 నెలల ముందే అభ్యర్థుల ప్రకటన.. తొందర పడుతున్న రాజకీయ పార్టీలు

ట్రెండింగ్ వార్తలు