హిమాలయాలకు వెళ్తారా! : 2019 ఎన్నికల్లో పోటీ చేయనన్న రజనీ

  • Publish Date - February 17, 2019 / 05:36 AM IST

2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో జరుగనున్న జనరల్ ఎలక్షన్స్ లో తాను పోటీ చేయడం లేదని రజనీ ప్రకటించారు.తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపడం లేదని తెలిపారు. తమ టార్గెట్‌ 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలేనని అన్నారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్‌ మాట్లాడుతూ రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో ఎవరైనా తమ ఫోటోగానీ, పార్టీ గుర్తు కానీ వాడరాదని సూచించారు. ఒకవేళ అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీకాంత్‌ హెచ్చరించారు. తమిళనాట నెలకొన్న ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

ఏడాదిన్నర క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన  రజనీకి ప్రధాని మోడీతో మంచి సంబంధాలున్నాయి.నరేంద్రమోడీ ఒకసారి తమిళనాడు పర్యటనకు వెళ్లినప్పుడు రజనీ ఇంటికి కూడా వెళ్లి ఆయనను కలిసారు.బీజేపీతో రజనీ సన్నిహితంగా మెలుగుతున్నాడని తంబీలు గుసగులాడుకొంటున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండే ముందుగా హిమాలయాలకు వెళ్లి రావాలని భావించిన రజనీ ఇటీవల హియాలయాల పర్యటనకు వెళ్లి వచ్చారు.

 

బీజేపీతో రజనీ సన్నిహితంగా మెలుగుతున్నాడని తంబీలు గుసగులాడుకొంటున్నారు.ఒకదశలో బీజేపీతో కలిసి రజనీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తాను లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు రజనీ ప్రకటించడం చూస్తే బీజేపీకి మద్దతులో భాగంగానే రజనీ ఈ నిర్ణయం తీసుకొన్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.