RSS 'suppresses women', don't allow them in their organisation says Rahul Gandhi
Rahul Gandhi: భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల్ని ఆర్ఎస్ఎస్ అణచివేస్తోందంటూ విరుచుకుపడ్డ ఆయన అసలు ఆర్ఎస్ఎస్లో మహిళల్ని ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సీతారాములను సూచించే విధంగా ‘జై సియారాం’ అని ఎందుకు అనడం లేదని, ‘జై శ్రీరాం’ అని మాత్రమే ఎందుకు అంటున్నారని ఆర్ఎస్ఎస్, బీజేపీలను ఉద్దేశించి ప్రశ్నించారు.
Himachal Pradesh: కేబినెట్ విస్తరణపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
భారత్ జోడో యాత్రంలో భాగంగా ప్రస్తుతం రాహుల్ రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువారం దౌసా జిల్లాలోని బగ్డి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్లోకి మహిళల్ని అనుమించరు. ఎందుకు మహిళల్ని అణచివేసేదే వారు. ఆర్ఎస్ఎస్లో రాష్ట్ర సేవిక సమితి అనే మహిలా విభాగం ఉంది. కానీ దాని ప్రభావం ఎక్కడా ఉండదు. కనీసం చర్చలో కూడా ఉండదు. ఆర్ఎస్ఎస్కు మహిళలపై ఎంత వ్యతిరేకత అంటే.. వారు జై శ్రీరాం అని మాత్రమే అంటారు. జై సియారాం అని అనరు’’ అని అన్నారు.
ఇక దేశంలో పెరిగిపోతున్న ధనిక, పేద అంతరాలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 100 మంది దగ్గర ఉన్న సంపద, దేశంలోని 55 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపదతో సమానమని అన్నారు. దేశ సంపదను డబ్బులు ఉన్న కొద్ది మందికి మోదీ ప్రభుత్వం దోచి పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని పరోక్షంగా వారే నడిపిస్తున్నారని, దేశం వారి కోసమే నడుస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, మీడియా ప్రభుత్వానికి కీలు బొమ్మలుగా మారాయని రాహుల్ విమర్శించారు.