Kamalnath: వివాదాస్పద బాబాను కలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‭నాథ్

భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్‭నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏమీ తోచలేని స్థితిలో కాంగ్రెస్ ఉంటే.. కమల్‭నాథ్ మాత్రం రామాలయ శంకుస్థాపనకు వెళ్లారు. ఇక పలు సందర్భాల్లో ఇదే జరిగింది.

Kamalnath: మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు సైతం ఆయనను కలుస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలాంటిదేమీ లేదని నాయకులే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో ధీరేంద్ర శాస్త్రిని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‭నాథ్ కలుసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. భాగేశ్వర్ ధాం వెళ్లి మరి బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని కలుసుకోవడం గమనార్హం.

Amit Shah: మొఘల్ వారసత్వాన్ని ఎవరూ చెరిపేయలేరు.. ఆసక్తికరంగా స్పందించిన అమిత్ షా

భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రతీసారి.. కమల్‭నాథ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రామమందిరం విషయంలో కూడా ఇదే జరిగింది. రామమందిరం పూర్తి క్రెడిట్ బీజేపీ తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టింది. ఏమీ తోచలేని స్థితిలో కాంగ్రెస్ ఉంటే.. కమల్‭నాథ్ మాత్రం రామాలయ శంకుస్థాపనకు వెళ్లారు. ఇక పలు సందర్భాల్లో ఇదే జరిగింది. ఇక ధీరేంద్ర శాస్త్రి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో కమల్‭నాథ్ బాగేశ్వర్ ధామ్ బయల్దేరడం కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోందని సమాచారం.

Pulwama Attack: పుల్వామా నరమేధానికి నాలుగేళ్లు.. అత్యున్నత త్యాగమంటూ ప్రధాని మోదీ నివాళులు

ట్రెండింగ్ వార్తలు