Pulwama Attack: పుల్వామా నరమేధానికి నాలుగేళ్లు.. అత్యున్నత త్యాగమంటూ ప్రధాని మోదీ నివాళులు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన 12 మంది సభ్యుల బృందం ఈ దాడిపై విచారణను చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి పనిచేసింది. కారులో 300 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలు ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఇందులో 80 కిలోగ్రాముల ఆర్‭డీఎక్స్, అధిక పేలుడు పదార్థం, అమ్మోనియం నైట్రేట్ ఉన్నాయి

Pulwama Attack: పుల్వామా నరమేధానికి నాలుగేళ్లు.. అత్యున్నత త్యాగమంటూ ప్రధాని మోదీ నివాళులు

4 years of Pulwama attack, PM Modi remembers martyrs

Pulwama Attack: జమ్మూ కశ్మీర్‭లోని పుల్వామాలో జరిగిన నరమేధానికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2019 ఫిబ్రవరి 14న జరిగిన దుర్మార్గపు దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధాకర సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ అమర జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా నివాళులు అర్పించారు. ‘పుల్వామాలో ఇదే రోజున మనం వీరులను కోల్పోయాము. వారి అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. మన దేశాన్ని బలంగా తీర్చిదిద్దుకుంటూనే అభివృద్ధి పథంలో నడిపించేందుకు వారి ధైర్యం మనకు ప్రేరణ ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.

Gautam Adani Group: హిండెన్‌బర్గ్ దెబ్బకు.. గ్రాంట్ థోర్న్‌టన్‌ను నియమించుకున్న అదానీ గ్రూప్

జమ్మూ నుంచి శ్రీనగర్‌కు 2,500 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‭పీఎఫ్) సిబ్బందిని రవాణా చేస్తున్న 78 వాహనాల కాన్వాయ్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంతో 40 మంది ఇండియన్ సీఆర్‭పీఎఫ్ సిబ్బంది మరణించారు. సైనికులతో పాటు, పుల్వామా జిల్లాకు చెందిన స్థానిక కాశ్మీరీ యువకుడైన ఆదిల్ అహ్మద్ దార్ కూడా మరణించాడు.

MP Komatireddy Venkat Reddy : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

తీవ్రవాద మూఖలు చేసిన ఈ కుట్రకు భారత మిలిటరీ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‭లోని బాలాకోట్ మీద వైమానిక దాడి చేసింది. జైషే మహ్మద్ శిక్షణా శిబిరంపై భారత వాయుసేన దాడి చేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చామని భారత్ ప్రకటించింది. భారతదేశం, పాకిస్తాన్ జెట్‌ల మధ్య జరిగిన పోరాటంలో ఒక భారతీయ మిగ్ -21 పాకిస్థాన్ లో పడింది. మిగ్ పైలట్ అభినందన్ వర్థమాన్ పాక్ గ్రామస్థులకు చిక్కాడు. వర్ధమాన్‌ను పాక్ సైనికులు రక్షించి, ప్రథమ చికిత్స చేసి ప్రశ్నించారు. అనంతరం పాక్ వర్ధమాన్‭ను తమ చెర నుంచి విడుదల చేసింది.

Viral Video: బుడ్డోడు భలే పనిమంతుడు.. క్యాన్లు మోస్తూ తల్లికి అండగా చిన్నారి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు ..

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన 12 మంది సభ్యుల బృందం ఈ దాడిపై విచారణను చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి పనిచేసింది. కారులో 300 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలు ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఇందులో 80 కిలోగ్రాముల ఆర్‭డీఎక్స్, అధిక పేలుడు పదార్థం, అమ్మోనియం నైట్రేట్ ఉన్నాయి. అయితే, ఏడాదిపాటు దర్యాప్తు చేసినప్పటికీ పేలుడు పదార్థాల మూలాన్ని ఎన్‌ఐఏ కనిపెట్టలేకపోయింది. ఆగస్టు 2020లో ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో మొత్తం 19 మంది నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు.