Sanjay Raut: పాకిస్తాన్‭తో గొడవ అయితే క్రికెట్ మ్యాచ్ ఆడొద్దట.. జమ్మూ కశ్మీర్ కాల్పులపై సంజయ్ రౌత్ వాదన

ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Sanjay Raut on J&K Attack: ఇండియా, పాకిస్తాన్ మధ్య వైరం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ మ్యాచ్ ను కూడా యుద్ధం లాగే చూస్తుంటారు. ఇక యుద్ధమే జరిగితే.. అది వేరే రేంజులో ఉంటుంది. యుద్ధం కాదు కానీ సరిహద్దులో అప్పుడప్పుడు అనుచిత ఘటనలు జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ ఆధారిత మిలిటెంట్లు చేసే దాడులకు మన జవాన్లు, జమ్మూ కశ్మిర్ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా జరిగిన దాడిలో కూడా ముగ్గురు జవాన్లు మృతి చెందారు. అయితే దీనిని ప్రస్తావిస్తూ.. ఒక పక్క దాడులు అవుతుంటే మరొక పక్క పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్.

Tamilnadu: అంబేద్కర్, దళితుల మీద కులదూషణలు.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్

ప్రస్తుతం ఆసియా కప్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో దాడి జరగడం ఆయన వ్యాఖ్యలకు మరింత పదును పెంచింది. దీంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీ-20 విజయవంతమైన సందర్భంగా బీజేపీ ఆఫీసులో మోదీపై పూల వర్షం కురిపించడాన్ని ప్రస్తావిస్తూ.. మన సైనికులపై పూల వర్షం ఎప్పుడు కురుస్తుందంటూ ప్రశ్నించారు. మన అధికారులు ముగ్గురు అమరులయ్యారని, జమ్మూకశ్మీర్‌ పరిస్థితి నేటికీ బాగా లేదని స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అన్నారు.

Congress vs TMC: ఇదేం రాజకీయం.. అటు పొత్తు పెట్టుకుంటూనే ఇటు చిత్తుగా తిట్టుకుంటున్నారు

ఒకవైపు పీఓకేని తమ ఆధీనంలోకి తీసుకుంటామని బీజేపీ చెబుతోందని, మరోవైపు పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ ఆడుతోందంటూ రౌత్ విమర్శించారు. ఇంతలో పార్లమెంటు సమావేశానికి సంబంధించి మాట్లాడుతూ, ప్రభుత్వం చాలా విషయాలు దాచిపెడుతోందని విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు కొనసాగుయి. అయితే 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల తర్వాత బీజేపీ అసలు రంగు బయటపడుతుందని సంజయ్ రౌత్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు