ఉత్తరాంధ్రలో ఈసారి ఎగిరే జెండా ఏది? ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది.

Special Analysis On Uttarandhra Politics

Uttarandhra Politics : ఉత్తరాంధ్ర.. రాష్ట్రంలో ఓ చివరన ఉన్న మూడు జిల్లాలు కలిసిన ప్రాంతం. సువిశాల సముద్ర తీరం. పూర్తిగా వ్యవసాయ ఆధారం. ఎంతో రాజకీయ చైతన్యం. పెద్ద పెద్ద నాయకులకు నిలయం. తరతమ బేధం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే మనస్తత్వం అక్కడి ప్రజల సొంతం. 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గిరగిరా తిరిగింది.

అంతకుముందు అంటే 2014లో టీడీపీ, ఇంకా ముందుకెళితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర వెన్నుదన్నుగా నిలిచింది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

విప్లవ చైతన్యం నరానరాన జీర్ణించుకున్న సిక్కోలు ప్రజలు ఈసారి ఎవరికి జైకొడుతున్నారు? విద్యల నగరం విజయనగరం కోటపై ఎగిరే జెండా ఏది? ఉక్కు నగరంపై పట్టు సాధించే పార్టీ ఏది? ఉత్తరకోసా డిటైల్ రిపోర్టు..

Also Read : ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..! కారణం అదేనా? జగన్ వ్యూహం ఏంటి?

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 1999
మొత్తం సీట్లు – 37
తెలుగుదేశం పార్టీ – 27 (శ్రీకాకుళం-10, విజయనగరం-6, విశాఖపట్నం-11)
కాంగ్రెస్‌ – 10 (శ్రీకాకుళం-2, విజయనగరం-6, విశాఖపట్నం-2)

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2004
మొత్తం సీట్లు – 37
కాంగ్రెస్‌ – 21 (శ్రీకాకుళం-7, విజయనగరం-6, విశాఖ-8)
తెలుగుదేశం – 12 ( శ్రీకాకుళం – 4, విజయనగరం-5, విశాఖపట్నం-3)
ఇతరులు -4 (కురుపాం-CPM, విజయనగరం-స్వతంత్ర, చింతపల్లి-సీపీఐ, పాడేరు-బీఎస్‌పీ లకే రాజారావు)

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2009
మొత్తం సీట్లు – 34
కాంగ్రెస్‌ – 23 (శ్రీకాకుళం-9, విజయనగరం-7, విశాఖపట్నం-7)
తెలుగుదేశం – 7 (శ్రీకాకుళం-1, విజయనగరం-2, విశాఖపట్నం-4)
ప్రజారాజ్యం – విశాఖపట్నం జిల్లాలో 4 సీట్లు గెలుచుకుంది

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2014
మొత్తం సీట్లు – 34
తెలుగుదేశం 24 ( శ్రీకాకుళం – 7, విజయనగరం – 6, విశాఖపట్నం – 11)
వైసీపీ 9 (శ్రీకాకుళం-3, విజయనగరం – 3, విశాఖపట్నం – 3)
2014 ఎన్నికల్లో బీజేపీ విశాఖ నార్త్‌ నుంచి గెలుపొందింది

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2019
మొత్తం సీట్లు – 34
వైసీపీ 28 ( శ్రీకాకుళం – 9, విజయనగరం – 9, విశాఖపట్నం -10 )
వైసీపీ 5 (శ్రీకాకుళం-1, విజయనగరం – 0, విశాఖపట్నం – 4)

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
ఇచ్ఛాపురం – బెందాళం అశోక్, సిట్టింగ్‌ ఎమ్మెల్యే
పిరియా విజయ, జడ్‌పీ చైర్‌పర్సన్‌
పలాస – సిదిరి అప్పలరాజు, మంత్రి,
గౌతు శిరీష, జుత్తు తాతారావు
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ, కె.అచ్చెన్నాయుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే
పాతపట్నం – రెడ్డి శాంతి, లోతుగడ్డ తులసీ వరప్రసాద్‌, మామిడి శ్రీకాంత్‌ (వైసీపీ)
కలమట వెంకటరమణ, మామిడి గోవింద, గేదల చైతన్య ( జనసేన)
నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్‌
బగ్గు రమణమూర్తి, బగ్గు శ్రీనివాస్‌
శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు (వైసీపీ)
గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు (టీడీపీ)
ఆమదాలవలస – తమ్మినేని సీతారాం, చింతాడ రవికుమార్‌, సువ్వారి గాంధీ
కూన రవికుమార్‌
ఎచ్చెర్ల – గొర్లె కిరణ్‌కుమార్‌, బెల్లాన చంద్రశేఖర్‌, మజ్జి శ్రీనివాసరావు
కిమిడి కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు
రాజాం డాక్టర్‌ తలె రాజేశ్‌, కోండ్రు మురళీమోహన్‌
పాలకొండ – విశ్వసరాయి కళావతి, నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి
——————————–

Also Read : 70ఏళ్ల రాజకీయానికి ఫుల్‌స్టాప్‌.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు గల్లా కుటుంబం దూరం

ఉమ్మడి విజయనగరం జిల్లా
కురుపాం – పాముల పుష్పశ్రీవాణి
తోయిక జగదీశ్వరి, పువ్వల లావణ్య
పార్వతీపురం – అలజంగి జోగారావు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే, జమ్మాన ప్రసన్నకుమార్‌, సవరపు జయమణి
బోనెల చిరంజీవి, బొబ్బిలి చిరంజీవులు
సాలూరు – పీడిక రాజన్నదొర, శోభా స్వాతిరాణి
గుమ్మడి సంధ్యారాణి, తేజోవతి, ఉపాధ్యాయురాలు
బొబ్బిలి – శంబంగి వెంకట అప్పలనాయుడు, బేబి నాయన
గజపతినగరం బొత్స అప్పలనరసయ్య,
కొండపల్లి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు, కరణం శివరామకృష్ణ
పడాల అరుణ – జనసేన
చీపురుపల్లి – బొత్స సత్యానారాయణ, కిమిడి నాగార్జున
నెల్లిమర్ల – బడ్డుకొండ అప్పలనాయుడు, కర్రోతు బంగార్రాజు, లోకం మాధవి (జనసేన)
శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు
కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ, ఎన్‌ఆర్‌ఐ
విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి
అదితి గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు, మీసాల గీత
—————–

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
భీమిలి – అవంతి శ్రీనివాసరావు
కోరాడ రాజబాబు, గంటా శ్రీనివాసరావు, సందీప్‌ పంచకర్ల
విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే
విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్‌కుమార్‌, గండి బాబ్జి, వంశీకృష్ణ యాదవ్‌
విశాఖ ఉత్తర – కేకే రాజు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు
విశాఖ పశ్చిమ – ఆడారి ఆనంద్‌కుమార్‌, గణబాబు, ఎమ్మెల్యే
గాజువాక – వరికూటి రామచంద్రరావు, పల్లా శ్రీనివాసరావు
పెందుర్తి – ఆదీప్‌రాజు, గుడివాడ అమర్‌నాథ్‌
బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు ( జనసేన )
అనకాపల్లి – మలసాల భరత్‌, పీలా గోవిందరావు
చోడవరం – కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్‌
బత్తుల తాతయ్యబాబు, కేఎస్‌ఎన్‌ రాజు
మాడుగుల – బూడి ముత్యాలనాయుడు
పీవీజీఆర్‌ కుమార్‌, గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్‌
ఎలమంచిలి – కన్నబాబురాజు, సుకుమార వర్మ
ప్రగడ నాగేశ్వరరావు, సుందరపు విజయ్‌కుమార్‌ (జనసేన)
పాయకరావుపేట – కంబాల జోగులు, వంగలపూడి అనిత
నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, అయ్యన్నపాత్రుడు
అరకు – గొడ్డేటి మాధవి, దున్ను దొర
పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గిడ్డి ఈశ్వరి

 

ట్రెండింగ్ వార్తలు