హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయానికి కారణం ఇదే

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు

  • Publish Date - October 24, 2019 / 09:33 AM IST

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇది ప్రజాతీర్పని ఇప్పటికైనా ప్రతిపక్షాలు గమనించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా హుజూర్ నగర్ లో మోహరించారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు విజ్ఞతతో టీఆర్ఎస్ ను గెలిపించారని అన్నారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలవడంతో హన్మకొండలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రజలిచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించారని అన్నారు. 

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. 43వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని చిత్తుగా ఓడించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ గెలవటం ఇదే ప్రథమం. ఫస్ట్ టైం విక్టరీలోనే రికార్డ్ మెజార్టీ సాధించటం విశేషం. ఈ నియోజకవర్గంలో గతంలో 29వేల ఓట్ల మెజార్టీ అనేది అత్యధికం. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో గెలుపొంది రికార్డ్ సృష్టించారు.

సైదిరెడ్డికి 89వేల 459 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 55వేల 227 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామారావు కేవలం వెయ్యి 779 ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి కేవలం వెయ్యి 440 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు ఎన్నికల అధికారులు.