విజయవాడ : టీడీపీపై జగన్ అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేత లంక టీడీపీ నేత లంక దినకరన్ మండిపడ్డారు. రాక్షస ఆనందంతో వచ్చే నిధులను జగన్ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కోర్టులో కేసులు వేయిస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు, పోలవరంపై కేసులు వేశారని తెలిపారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
లోటు బడ్జెట్ ను పూడ్చకపోయినా… కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్రతిపక్షాలు పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. పది లక్షల మందిని లక్ష్యంగా చేసుకుని నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తున్నామని తెలిపారు. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జగన్, కేసీఆర్, మోడీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.