మచిలీపట్నం వెళ్తా..ఎవరు అడ్డుకుంటారో చూస్తా : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వెళ్తానని..ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.

  • Publish Date - January 9, 2020 / 08:34 AM IST

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వెళ్తానని..ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వెళ్తానని..ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. గురువారం (జనవరి 9, 2020) విజయవాడలో జేఏసీ నిర్వహించిన మీటింగ్ లో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రకు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు అనుమతి ఇవ్వనన్నారని తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్ర చేశారని తెలిపారు. తాను అడ్డుకుని ఉంటే రాజశేఖర్ రెడ్డి, జగన్ పాదయాత్ర చేసేవాళ్లా అని ప్రశ్నించారు. 

ప్రజాస్వామ్య బద్దంగా వెళ్లాలనే ఉద్దేశంతోనే వారి పాదయాత్రను అడ్డుకోలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ఆందోళనలు ఆగవు అని అన్నారు. ప్రజా రాజధాని కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. జగన్ లాంటి పిరికివాడు ఇంకొకరు ఉండరని విమర్శించారు. శాంతి భద్రతల పేరుతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని, ఉద్యమానికి అడ్డుపడితే ఉధృతమే అవుతంది తప్ప తగ్గదన్నారు. 

ఒంగోలులో టీడీపీ, జేఏసీ నేతలను అరెస్టు చేశారని తెలిపారు. జేఏసీ మమూలుగా మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా వీల్లేదా అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమాన్ని ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. ఇప్పటి వరకు 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడం సరికాదన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోండన్నారు.