అనంతపురం: జిల్లాలోని తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం టెన్షన్ క్రియేట్ చేసింది. తోపుదుర్తి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రకాష్‌రెడ్డి స్వగ్రామం. చంద్రన్న
అనంతపురం: జిల్లాలోని తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం టెన్షన్ క్రియేట్ చేసింది. తోపుదుర్తి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రకాష్‌రెడ్డి స్వగ్రామం. చంద్రన్న పసుపు-కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత కాసేపట్లో గ్రామంలో పర్యటించనున్నారు. అయితే.. మంత్రిని గ్రామంలోకి రానివ్వబోమంటూ వైసీపీ కార్యకర్తలు ప్రకటించారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు.. ప్రకాశ్ రెడ్డిని అనంతపురంలోని తన ఇంట్లో పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని.. ఖచ్చితంగా తాను గ్రామంలో పర్యటించి తీరుతానని మంత్రి సునీత తేల్చి చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలో గ్రామస్థులు ఉన్నారు.
* అనంతపురం జిల్లా తోపుదుర్తిలో టెన్షన్
* పసుపు-కుంకుమ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పరిటాల సునీత
* మంత్రిని గ్రామంలోకి అడుగు పెట్టనివ్వబోమంటున్న వైసీపీ
* గ్రామంలోకి వెళ్లి తీరుతామంటున్న మంత్రి సునీత
* ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకోలేరంటున్న సునీత
* భారీగా మోహరించిన పోలీసులు
* భయాందోళనలో తోపుదుర్తి గ్రామస్థులు