Andheri East By Poll: శివసేన చీలిపోయిన అనంతరం షిండే-ఉద్ధవ్‭లకు తొలి పరీక్ష

శివసేన టికెట్టుపై గెలిచిన లాట్కే ఈ యేడాది మేలో మరణించారు. దీంతో తూర్పు అంధేరీలో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో లాట్కే భార్యను నిలబెట్టే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉంది. ఇక బీజేపీ-షిండే వర్గం మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్‭ను రంగంలోకి దింపుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నిక పూర్తిగా శివసేన వర్సెస్ శివసేనగానే జరగనుంది. షిండేకు బీజేపీ మద్దతు.. ఉద్ధవ్‭కు ఎన్సీపీ మద్దతు ఉన్నాయి

Andheri East By Poll: శివసేన పార్టీ చీలిపోయిన అనంతరం అధికారికంగా పార్టీ తమదే అంటే తమదే అంటూ అటు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గం, ఇటు ఉద్ధవ్ థాకరే వర్గం ఒకరినొకరు కత్తులు నూరుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై చాలా రోజులుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయితే రాజకీయ పార్టీలపై సాంకేతికంగా కోర్టులు తీర్పు ఇస్తాయేమో కానీ, నైతికంగా ప్రజల నుంచే అసలైన తీర్పు వస్తుంది. తొలిసారి రెండు వర్గాలకు ఈ పరీక్ష ఎదురు కానుంది. అదే తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికతో.

వాస్తవానికి ఒక నియోజకవర్గంతో అంతిమ తీర్పు అనేది వస్తుందని చెప్పలేం కానీ, అసెంబ్లీ ఎన్నికలనేవి ప్రాంతీయ పార్టీల మీద ప్రజల అభిప్రాయాన్ని వెల్లడిస్తాయి. అప్పుడప్పుడు జరిగే ఉప ఎన్నికలను ఈ కోవలోకి తీసుకోవచ్చు. దీనికి ముందు పంచాయతీ ఎన్నికలుజరిగాయి. కానీ పార్టీ గుర్తు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీల భవిష్యత్, ప్రజల తీర్పును లెక్కకట్టలేం. అంతే కాకుండా అవి పూర్తిగా స్థానిక నాయకత్వంపై ఆధారపడి ఉంటాయి.

Dattatreya Hosabale: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, పేదరికంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్

పంచాయతీ ఎన్నికలను పక్కన పెడితే మరికొద్ది రోజుల్లో తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికనే తొలి పరీక్షగా భావించవచ్చు. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. ముంబైలో శివసేను బాగా పట్టుంది. ముంబై కేంద్రంగానే శివసేన అన్ని కార్యకలాపాలు చేస్తుంది. కావున.. ముంబైలోని ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ శివసేనకు జై కొడితే ఆ శివసేనను అసలైనదిగా భావించడానికి కొంత ఆస్కారం ఏర్పడుతుంది.

వాస్తవానికి ఈ స్థానం శివసేనదే. శివసేన టికెట్టుపై గెలిచిన లాట్కే ఈ యేడాది మేలో మరణించారు. దీంతో తూర్పు అంధేరీలో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో లాట్కే భార్యను నిలబెట్టే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉంది. ఇక బీజేపీ-షిండే వర్గం మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్‭ను రంగంలోకి దింపుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నిక పూర్తిగా శివసేన వర్సెస్ శివసేనగానే జరగనుంది. షిండేకు బీజేపీ మద్దతు.. ఉద్ధవ్‭కు ఎన్సీపీ మద్దతు ఉన్నాయి. ఈ స్థానాన్ని ఎవరు గెలిచి అసలైన శివసైనికులము తామేనని నిరూపించుకుంటారో చూడాలి మరి.

Karnataka Flag: కర్ణాటక జెండాపై రాహుల్ గాంధీ ఫొటో.. మండిపడుతున్న కన్నడ సంఘాలు

ట్రెండింగ్ వార్తలు