బాబోయ్ ఈ మాటలు : చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
- madhu
- Published On : April 24, 2019 / 07:24 AM IST
ఏపీ సీఎం చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ట్వీట్లతో విచుకుపడ్డారు. సోనియా ఏపికి సమన్యాయం చేసిందని బాబు అంటున్నాడని.. దెయ్యం అని దూషించిన సోనియాను దేవతను చేశాడని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టి.. కట్టుబట్టలతో పంపించారంటూ గుడ్లురిమిన వ్యక్తి.. ఇప్పుడు విడదీసి మంచి పని చేశారంటున్నాడని.. డాక్టరుకు చూపించండయ్యా అంటూ సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి.
40 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని బాబుకి పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయని.. అయినా 130, 150 అని బడాయి పోతున్నాడంటూ విమర్శలు చేశారు. EVMలపై దేశవ్యాప్త ఉద్యమం బెడిసికొట్టిందో ఏమో? వైఎస్ఆర్ కాంగ్రెస్ హెలికాప్టర్లతో డబ్బులు వెదజల్లిందన్నట్టు కొత్త రాగం అందుకున్నాడని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బతిమాలి మరీ బాబు ఆహ్వానాలు తెప్పించుకుంటున్నారని చురకలు అంటించారు.
టీడీపీ మాజీ రాజ్యసభ్య సభ్యులు డీఎంకే, జేడీఎస్, ఎన్ సీపీ నాయకులతో ఫోన్లలో అదే పనిగా సంప్రదిస్తున్నారనే సమాచారం ఉందన్నారు. ఓటమికి కుంటి సాకులు వెతకడంలో.. తప్పు కంటే కుల మీడియా జోరు ప్రదర్శిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ డబ్బు పంపిణీలో సక్సెస్ అయిందని చెత్త రాతలు మొదలు పెట్టిందంటూ మండిపడ్డారు. డబ్బు పంచలేక బాబు ఓడిపోతున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోందని.. అసలు డబ్బులు వెదజెల్లే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే టీడీపీ అంటూ విజయసాయి ఆరోపించారు.
చంద్రబాబును పిచ్చికుక్క కరిచినట్టు అనుమానం వస్తోంది. సోనియా ఏపికి సమన్యాయం చేసిందంటున్నాడు. దెయ్యం అని ధూషించిన సోనియాను దేవతను చేశాడు. అడ్డగోలుగా విడగొట్టి కట్టుబట్టలతో పంపించారని గుడ్లురిమిన వ్యక్తి ఇప్పుడు విడదీసి మంచిపని చేశారంటున్నాడు. డాక్టరుకు చూపించండయ్యా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2019
నలబై సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు యాంటెన్నాకు పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయి. అయినా 130,150 అని బడాయికి పోతున్నాడు.ఇవిఎంలపై దేశ వ్యాప్త ఉద్యమం బెడిసికొట్టిందో ఏమో? వైఎస్సార్ కాంగ్రెస్ హెలికాప్టర్లతో డబ్బులు వెదజల్లిందన్నట్టు కొత్త రాగం అందుకున్నాడు.

ఓటమికి కుంటి సాకులు వెతకడంలో తుప్పు కంటే కుల మీడియా జోరు ప్రదర్శిస్తోంది. వైఎస్పార్ కాంగ్రెస్ డబ్బు పంపిణీలో సక్సెస్ అయిందని చెత్త రాతలు మొదలు పెట్టింది. డబ్బు పంచలేక బాబు ఓడిపోతున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం. అసలు డబ్బులు వెదజెల్లే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే మీ జాతి రత్నం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2019