అధికారంలోకి వస్తే : గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తాం

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్

  • Publish Date - March 23, 2019 / 10:19 AM IST

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాడేరులో ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాలను టీడీపీ ప్రభుత్వం  పట్టించుకోలేదన్నారు. తన తండ్రి వైఎస్ తర్వాత రాజకీయాల్లో ఆరాటంతో పనిచేసే నాయకులు, ప్రజల కోసం పని చేసే నాయకులు కరువయ్యారని జగన్ అన్నారు. 7లక్షల ఎకరాలు ఎస్టీలకు వైఎస్ పంచారని తెలిపారు.  బాక్సైట్ అక్రమ మైనింగ్ వైసీపీ పోరాటాల వల్లే ఆగిపోయిందన్నారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలను చూశాను అని జగన్ చెప్పారు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను కేసుల్లో ఇరికించారని జగన్ ఆరోపించారు.

ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు ఏపీని నెంబర్ 1 చేశారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయని వారిలో చంద్రబాబు నెంబర్ 1 అని విమర్శించారు. పాడేరులో ఎన్నికల  ప్రచారంలో చంద్రబాబు వైఖరిపై జగన్ మండిపడ్డారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, హత్యలు, దుర్మాగ్గాలను చూశామన్నారు. ఐదేళ్ల మన జీవితాలు ఖర్మ కొద్ది చంద్రబాబు చేతిలో పెట్టామన్నారు. 22మంది  ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడేలా చంద్రబాబు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల నేరాలను మాఫీ చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.