Site icon 10TV Telugu

పంచాయతీ సిత్రం : ఒక్క ఓటుతో సర్పంచ్‌ పదవి కైవసం.. నిజం

Wonders In Telangana Panchayat Elections

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. వినడానికి విడ్డూరంగా నమ్మలేని నిజాలు జరిగాయి.

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. వినడానికి విడ్డూరంగా నమ్మలేని నిజాలు జరిగాయి. కొందరు అభ్యర్థులు అనూహ్యంగా ఓటమి పాలైతే.. కొందరు సర్పంచ్‌ పదవి దక్కించుకున్నారు. కొంతమంది ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌ పదవి దక్కించుకోగా… మరికొంత మంది స్వల్ప తేడాతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మరికొన్ని చోట్ల కాయిన్‌.. సర్పంచ్‌ ఎవరన్నది తేల్చింది.

 

* పెద్దపల్లి జిల్లా హరిపురంలో ఒక్క ఓటుతో సర్పంచ్‌ పదవి కైవసం
* ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు
* రీ కౌంటింగ్‌లో ఒక్క ఓటుతో బయటపడ్డ సంపత్‌రావు
* జనగామ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
* జనగామ మండలం వడ్లకొండలో ఇద్దరు అభ్యర్థులు పోటీ
* బొల్లం గంగారాంపై శారద గెలుపు

 

జనగామ జిల్లాలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జనగామ మండలం వడ్లకొండలో బొల్లం శారద, బొల్లం గంగారాం సర్పంచ్‌ పదవి కోసం పోటీపడ్డారు. కౌంటింగ్‌లో గంగారాంపై బొల్లం శారద గెలిచారు. తుది ఫలితం ప్రకటించకముందే గంగారాం అనుచరులు 10మంది కౌంటింగ్‌ కేంద్రం దగ్గర కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామస్తులు వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

 

* పెద్దపల్లి జిల్లా రాయదండిలో ఒక్క ఓటుతో సర్పంచ్‌ పదవి కైవసం
* సర్పంచ్‌ బరిలో ఐదుగురు అభ్యర్థులు
* ధర్మాజీ కృష్ణకు 79 ఓట్లు, సదానందానికి 78 ఓట్లు
* రీ కౌంటింగ్‌తో తేలిన ఫలితం
* ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌ పదవి ధర్మాజీ కృష్ణ కైవసం
* నల్లగొండ జిల్లాలో కాయిన్‌ తేల్చిన విజయం
* జరుపుతండాలో సర్పంచ్‌ అభ్యర్థులకు సమానంగా ఓట్లు
* టాస్‌ వేసి సర్పంచ్‌ను ఎంపిక చేసిన అధికారులు

 

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జరుపులతండాలో విజయం ఇద్దరు అభ్యర్థులను దోబూచులాడింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులకు ఈ  గ్రామంలో చెరో 169 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్‌ వేశారు. టాస్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నిర్మలకు అనుకూలంగా పడడంతో ఆమెను సర్పంచ్‌గా ప్రకటించారు.

Exit mobile version