చంద్రబాబు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
చంద్రబాబు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుగుతుందని.. ఇందులో చంద్రబాబు బినామీ బాగోతాలు మరింతగా బయటికి వస్తాయన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తించారని తెలిపారు. రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని చంద్రబాబు ముందుగానే తన సహచరులకు అందించి.. అక్కడ భూములు కొని.. ఆ తర్వాత రాజధానిని ప్రకటించడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు.
రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై గురువారం (జనవరి 2, 2020) వైసీపీ వీడియో ప్రజంటేషన్ ఇచ్చింది. అమరావతిలో భూముల స్కామ్ జరిగిందని చెబుతూ అందుకు సంబంధించిన అక్రమాల ఆధారాలు, వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో నిడివి 21 నిమిషాలు ఉంది. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఈ వీడియోని మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ లపై ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పనని ప్రమాణం చేసిన బాధ్యత కల్గిన ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుగా వ్యవహరించారని విమర్శించారు. కాబట్టి ఇది శిక్షార్హమైనది కాబట్టి చంద్రబాబు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిన ఎంతటి వ్యక్తి అయినా సరే చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు మండిపడ్డారు. దత్తపుత్రుడు పవన్ కోసం బాబు హైరానా పడుతున్నారని విమర్శించారు. రాజధానిలో పవన్ నానా హంగామా సృష్టించారని పైర్ అయ్యారు. సీఎం వెళ్తుంటే సెక్యూరిటీ పెట్టకుండా ఉంటారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు కుట్ర స్వభావం కలిగిన వ్యక్తి అని, అధికారం కోసం దేనికైనా తెగిస్తారని అంబటి రాంబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని నమ్మొద్దని రాజధాని రైతులకు విజ్ఞప్తి చేశారు. హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు తన దత్తపుత్రుడితో కలిసి కుటుంబసమేతంగా చిచ్చు పెట్టాలని చూస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.
గత ఐదేళ్లలో రైతులు ఆందోళన చేశారు.. అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. మెర్సీ కల్లింగ్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు హత్యలకు కూడా వెనుకాడరని అంబటి అన్నారు. రాజధానిలో హత్యలు చేయించి ఆత్మహత్యలుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని అంబటి రాంబాబు హెచ్చరించారు.