కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో.. సరిగ్గా మధ్యాహ్నం 1.49 గంటలకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో.. సరిగ్గా మధ్యాహ్నం 1.49 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అలాగే తన పేరిట, తన ఫ్యామిలీ పేరిట ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను రిటర్నింగ్ అధికారికి జగన్ ఇచ్చారు.
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి
జగన్ తన పేరిట రూ.375.20 కోట్ల ఆస్తులు, రూ.1.19 కోట్ల అప్పులు ఉన్నట్టు అఫిడవిట్ లో వెల్లడించారు. తన భార్య భారతి పేరుపై రూ.124.12 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. పెద్ద కూతురు హర్షిణి పేరుపై రూ.6.45 కోట్ల ఆస్తులు, చిన్న కూతురు వర్ష పేరిట రూ.4.59 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ లో వివరించారు.
జగన్ ఆస్తులు, అప్పులు:
జగన్ పేరిట రూ.339.89 కోట్ల ఆస్తులు, రూ.1.19 కోట్ల అప్పులు
జగన్ భార్య భారతి పేరు మీద రూ.92.53 కోట్ల ఆస్తులు
జగన్ పెద్ద కూతురు హర్షిణి పేరిట రూ.6.45 కోట్ల ఆస్తులు
జగన్ చిన్న కూతురు వర్ష పేరిట రూ.4.59 కోట్ల ఆస్తులు
Read Also : చంద్రబాబు సరికొత్త స్లోగన్ : టీడీపీకి ఓటు వేస్తే గెలుపు ప్రజలదే అట