టార్గెట్ టెక్కలి : అచ్చెన్న ఓటమికి జగన్‌ స్కెచ్

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్‌గా వైసీపీ పావులు కదుపుతోంది. జగన్‌పై నేరుగా విమర్శలు చేసిన అచ్చెన్నను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ

  • Publish Date - March 11, 2019 / 03:53 PM IST

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్‌గా వైసీపీ పావులు కదుపుతోంది. జగన్‌పై నేరుగా విమర్శలు చేసిన అచ్చెన్నను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు టార్గెట్‌గా వైసీపీ పావులు కదుపుతోంది. జగన్‌పై నేరుగా విమర్శలు చేసిన అచ్చెన్నను దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది. మాజీ మంత్రులు ధర్మాన, తమ్మినేని.. కిల్లి కృపారాణి చేరికపట్ల అభ్యంతరం వ్యక్తం చేసినా..  జగన్‌ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీని మంత్రి అచ్చెన్నాయుడు నడిపిస్తున్నారు. మంత్రిగా, బీసి నేతగా అచ్చెన్నాయుడు చంద్రబాబుకు దగ్గరై చక్రం తిప్పుతున్నారు. ఛాన్స్ చిక్కినప్పుడల్లా వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ 3 అంశాలు వైసీపీకి మింగుడు పడటం లేదు. దీంతో అచ్చెన్నాయుడు టార్గెట్‌గా.. వైసీపీ పావులు కదుపుతోంది.

మంత్రి అచ్చెన్నాయుడుని ఎన్నికల్లో ఓడించాలంటే .. ప్రస్తుత టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త పేరాడ తిలక్ వల్ల సాధ్యం కాదు. దీంతో టార్గెట్ రీచ్‌ అయ్యేందుకు అధినేత జగన్‌ ఫోకస్‌ పెట్టారు. తిలక్ తో పాటు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు దువ్వాడ శ్రీనివాస్‌ని కలిసి పనిచేయాలని ఇప్పటికే సూచించారు. అంతేకాదు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రామ్మోహన్‌రావు దంపతులను పార్టీలోకి ఆహ్వానించి .. కృపారాణికి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలి పదవి కట్టబెట్టారు. ఈ ముగ్గురు నేతలు కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో ఈ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో .. వైసీపీ అటునుంచి నరుక్కుంటూ వచ్చింది.

ఈ ముగ్గురు నేతలకు టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాల్లో మంచి పట్టు ఉంది. అచ్చెన్నాయుడు ఐదేళ్లలో టెక్కలి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా వేలకోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీంతో 2 నెలల వరకు ఆయన గెలుపు సునాయాసమే అన్న ధీమా ఉంది. వైసీపీలో జరిగిన మార్పులు, దానికి తగ్గట్టుగా నేతలు సమన్వయంతో పనిచేయడం వంటి విషయాలు.. అచ్చెన్నాయుడికి ధీటైన సమాధానం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం వైసీపీ సైతం ఇక్కడ అభ్యర్ధి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీ తరుపున టెక్కలి అభ్యర్ధి ఎవరన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి అచ్చెన్నాయుడిని ఓడించడంలో వైసీపీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.