పర్చూరులో కలకలం : వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రామనాథంకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దగ్గుబాటినే పర్చూరు ఇంచార్జ్ గా

  • Publish Date - October 26, 2019 / 01:19 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రామనాథంకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దగ్గుబాటినే పర్చూరు ఇంచార్జ్ గా

ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రామనాథంకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దగ్గుబాటినే పర్చూరు ఇంచార్జ్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

పర్చూరు ఇంచార్జ్‌గా దగ్గుబాటి వెంకటేశ్వరరావునే కొనసాగించాలని వైసీపీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

శనివారం(అక్టోబర్ 26,2019) సాయంత్రం పర్చూరులో వైసీపీ కార్యకర్తలతో దగ్గుబాటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గందరగోళం నెలకొంది. నియోజకవర్గానికి దూరంగా ఉన్న దగ్గుబాటి.. ఇంచార్జ్ భాద్యతల నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. దగ్గుబాటి తర్వాత ఇంచార్జ్ పదవి ఎవరికి ఇవ్వాలన్న విషయంలో వాదోపవాదాలు జరిగాయి.
 
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రామనాధంబాబుకు ఇంచార్జ్ పదవి వద్దంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇంచార్జ్ పదవి వ్యవహారం వైసీపీలో వివాదంగా మారింది. ఈ సమావేశం తర్వాత దగ్గుబాటి ఏం తేల్చబోతున్నారు..? రాజకీయాల్లో ఉంటారా..? లేక తప్పుకుంటారా? అనేది కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. కాగా, పర్చూరు రాజకీయం రసవత్తరంగా మారింది. దగ్గుబాటికి, రామనాథంకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు