×
Ad

Chevireddy Bhaskar Reddy : టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారు. ఇలాంటి వారిని అంగీకరించరు.

  • Published On : April 12, 2024 / 08:13 PM IST

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy : ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీడీపీపై ఫైర్ అయ్యారు. ప్రజల్లో మద్దతు లేకపోవటంతో టీడీపీ నేతలు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరఫున కుటుంబసభ్యులు ప్రచారం చేయటం ఆనవాయితీ అని గుర్తు చేశారాయన. మహిళల ప్రచార సమయంలో మహిళలకు బొట్టు పెట్టి ఓటు అడుగుతారని చెప్పారు. ఓటు అభ్యర్ధించేందుకు వెళ్లిన బాలినేని కోడలిపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు.

టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనం అని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. ”ఆ అమ్మాయి చాలా సంయమనంతో మాట్లాడింది. దాడులకు పురికొల్పింది, ఘర్షణలకు పాల్పడింది టీడీపీ వాళ్లు. ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కొంతమంది అధికారులను తమ ఫిర్యాదుతో బెదిరింపులకు పాల్పడాలని చూస్తున్నారు.

మావైపు నుంచి అలాంటి చర్యలు జరిగితే కచ్చితంగా క్షమాపణలు చెప్పే వాళ్ళం. ఓ మహిళ అయ్యుండి ఘర్షణకు కారణమైన మహిళ పచ్చి బూతులు మాట్లాడింది. ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారు. ప్రజలు ఇలాంటి వారిని అంగీకరించరు” అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

Also Read : చంద్రబాబు కోటను బద్ధలు కొట్టడం సాధ్యమా? కుప్పంలో వైసీపీ భారీ వ్యూహం ఏంటి?