×
Ad

Margani Bharat : సీఎం జగన్‌కు పెద్ద ప్రమాదం తప్పింది, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు- ఎంపీ మార్గాని భరత్

చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు.

  • Published On : April 15, 2024 / 06:36 PM IST

Margani Bharat

Margani Bharat : మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి ఘటనపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. సీఎం జగన్ కు పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి చాలా బాధాకరం అన్నారు. ఎయిర్ గన్ తో కాల్చినట్లుగా తెలుస్తోందన్న ఎంపీ భరత్.. అదృష్టవశాత్తు జగన్ కు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. జగన్ పై దాడి ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల వ్యాఖ్యలు సరికాదన్నారు ఎంపీ భరత్. భగవంతుడు జగనన్న పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రాణాపాయం తప్పిందన్నారు. బహుశా.. చంద్రబాబే దాడి చేయించి ఉంటాడని అనుకుంటున్నాను అని భరత్ అనుమానం వ్యక్తం చేశారు.

”తెలుగుదేశం పార్టీకి ఇవి ఆఖరి ఎన్నికలు. రామన్న ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగు కాబోతోంది. చంద్రబాబు చేసే చిల్లర రాజకీయాలు అందరికీ అర్థం అవుతున్నాయి. చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. జగన్ పై జరిగిన దాడులను టీడీపీ నాయకులు అవహేళన చేస్తున్నారు” అని భరత్ ధ్వజమెత్తారు.

Also Read : సీఎం జగన్ పై దాడి.. ప్రధాని మోదీ, చంద్రబాబు ఏమన్నారంటే..