అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా: రాబిన్ ఉతప్ప

  • Publish Date - June 4, 2020 / 08:28 AM IST

2007 ప్రపంచ టీ20 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు రాబిన్ ఉతప్ప. 46 వన్డేలు, 13 టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన బిగ్-హిట్టింగ్ టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ ఊతప్ప. ఐపీఎల్‌లో మెరుపులతో ఆకట్టుకున్న ఊతప్పను ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 కోట్లకు కొనుక్కుంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఐపీఎల్ సస్పెండ్ అయ్యింది.

ఇదిలా ఉంటే.. రాయల్‌ రాజస్తాన్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన మైండ్‌, బాడీ, సోల్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఊతప్ప..  తాను క్రికెట్‌కు దూరమైన ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని టీమిండియా రాబిన్‌ ఊతప్ప వెల్లడించారు. క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకపోవడంతో ప్రతీ రోజూ నరకం అనుభవించేవాడినని, దాంతో చావే శరణ్యమని భావించి, ఇంటి బాల్కనీ నుంచి దూకేద్దామని అనుకున్నానని చెప్పాడు.

“నేను 2009 నుండి 2011 వరకు రెండేళ్లపాటు డిప్రెషన్‌లో ఉన్నానని, సూసైడ్‌ చేసుకోవాలని అనుకుడేవాడిని” అని అన్నారు. అయితే తర్వాతి కాలంలో అటువంటి ఆలోచనలు నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు.  ‘నేను 2006లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేశా. అప్పుడు నా గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పటి నుండి చాలా నేర్చుకోవడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం నా గురించి నాకు బాగా తెలుసు. నా ఆలోచనల్లో క్లారిటీ ఉంది. నేను కిందికి పడిపోతుంటే ఎలా పైకి వెళ్లాలనే దానిపై అవగాహన ఉందని అన్నారు. 

Read: Yuvraj Singh క్షమించమని అడుగు