వ్యవసాయం దండగ కాదు..పండగ..ఇది సీఎం కేసీఆర్ కల : మంత్రి హరీశ్ రావు

  • Publish Date - May 26, 2020 / 07:13 AM IST

వ్యవసాయం దండగ కాదు..పండగ అని నిరూపించాలనేది సీఎం కేసీఆర్ కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు.  కొండపోచమ్మ సాగర్‌ను మంత్రి ఇవాళ (మే 26,2020) పరిశీలించిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కాళేశ్వరం జలాలు సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో త్వరలోనే పారనున్నాయనీ తెలిపిన మంత్రి హరీశ్ రావు..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది.

ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయాన్ని  ఉదయం 11:30 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జలాశయంలోకి నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ ఆలయంలో చిన్నజీయర్‌ స్వామితో కలిసి సీఎం కేసీఆర్‌ హోమం నిర్వహించనున్నారని హరీష్‌ తెలిపారు.

ఈ జలాలు రైతన్నలకు వరంగా మారతాయని..ఇది నియంత్రిత సాగుకాదు..పంట ప్రాధాన్యతలను తెలిపే సాగుబడి అని రైతులు నిరూపించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వం సూచించిన పంటలను రైతులు సాగు చేసి.. అధిక దిగుబడి సాధించాలని మంత్రి హరీష్‌రావు ఆకాంక్షించారు. 

  Read: ఏపీలోకి అక్రమంగా తెలంగాణ మద్యం.. పట్టుకున్న పోలీసులు