తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..ఎప్పటినుండి అంటే..

  • Publish Date - May 19, 2020 / 07:04 AM IST

కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ తో తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలు ఆగిపోయాయి. ఈ క్రమంలో 10th క్లాస్ పరీక్షలకు తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.  జూన్ 3న పరీక్షల నిర్వహణపై సమీక్షించాలని..దీనికి సంబంధించి జూన్ 4న పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.   

అలా పరీక్షలు నిర్వహించే క్రమంలో ప్రతీ పరీక్షకు మధ్యలో రెండు రోజులు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పరీక్షా కేంద్రాలను పెంచాలని విద్యార్ధుల మధ్య భౌతిక దూరం పాటించేలా..ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించి పరీక్షా కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

అన్ని పరీక్షా కేంద్రాల వద్ద మాస్క్ లు..శానిటైజర్లు అందుబాటులో ఉండాలే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ప్రతీ విద్యార్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విద్యార్ధుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Read: హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటోలు, క్యాబ్ లు.. ఇలా అయితే కరోనా కేసులు పెరగడం ఖాయం