ప్రాజెక్ట్ సహస్రలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.. జూపల్లి రామేశ్వరరావు

Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Celebrations : భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు, వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు చిన్న జీయర్ స్వామి చేస్తున్న కృషి వెలకట్టలేనిదని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కొనియాడారు. వైష్ణవ సంప్రదాయాల పరిరక్షణతోపాటు ఆధ్యాత్మిక విలువలను భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ సహస్రలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Celebrations

Chinna Jeeyar Swamy 70th Thirunakshatra Celebrations : శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ 70వ తిరునక్షత్ర మహోత్సవాల (జన్మదిన వేడుకలను)ను పురస్కరించుకుని ‘యతీంద్ర సప్తతి’ పేరిట ఐదు రోజుల పాటు ఘనమైన ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమంలో ఈ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, శిష్యులు, ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Also Read : Chinna Jeeyar Swamy Birthday: ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా చిన్న జీయర్ స్వామి 70వ జన్మదిన వేడుకలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం!

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొని చిన్న జీయర్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

గత 36ఏళ్లుగా తాము చిన్న జీయర్ స్వామి భక్తులుగా కొనసాగుతున్నామని జూపల్లి రామేశ్వరరావు తెలిపారు. జీయర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సంక్షేమ రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతికి ట్రస్ట్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు, వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు చిన్న జీయర్ స్వామి చేస్తున్న కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. వైష్ణవ సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక విలువలను భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ సహస్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా చిన్న జీయర్ స్వామి చేపడుతున్న కార్యక్రమాలకు అందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా జూపల్లి శ్రీకుమారి మాట్లాడుతూ.. చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం విశేషమని పేర్కొన్నారు.