July 13 Maha Shaivakhya Yogam : 225 ఏళ్లలో కేవలం తొమ్మిది సార్లు.. జులై 13న ఈ అదృష్టాన్ని వదలొద్దు.. ఇలాచేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..
Maha Shaivakhya Yogam July 13 : 225 ఏళ్లలో కేవలం తొమ్మిది సార్లు ఏర్పడిన అరుదైన మహా శైవాఖ్య యోగం జులై 13న రానుందని పండితులు చెబుతున్నారు.
- Harish Thanniru
- Updated on- July 13, 2026 / 10:27 AM IST
Maha Shaivakhya Yogam July 13 Special Shiva Puja Benefits Arudra Nakshatram Somavaram Krishna Chaturdashi
Maha Shaivakhya Yogam July 13 : 225 ఏళ్లలో కేవలం తొమ్మిది సార్లు ఏర్పడిన అరుదైన మహా శైవాఖ్య యోగం జులై 13న రానుందని పండితులు చెబుతున్నారు. శివుడి జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం, సోమవారం, మాస శివరాత్రి ఒకేసారి కలవడంతో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పేర్కొంటున్నారు. ఈరోజున శివారాధన చేస్తే వంద మహాశివరాత్రులు ఆచరించినంత పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం..
శివ భక్తులకు అత్యంత విశిష్టమైన రోజు జులై 13వ తేదీగా ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. 225 సంవత్సరాల్లో కేవలం తొమ్మిసార్లు మాత్రమే ఇలాంటి అరుదైన యోగం ఏర్పడింది.. ఈ యోగాన్ని మహాశైవాఖ్య యోగంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయని పండితులు పేర్కొంటున్నారు.
పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం, శివారాధనకు అత్యంత పవిత్రమైన సోమవారం, అలాగే కృష్ణపక్ష చతుర్దశి తిథి ఒకేసారి రావడం అత్యంత అరుదైన విశేషమని, ఈ మూడు కలిసి ఏర్పడే యోగాన్ని మహా శైవాఖ్య యోగంగా భావిస్తారని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున పూజలు చేస్తే 100 మహా శివరాత్రులను ఆచరించినంత పుణ్యం వస్తుందని చెబుతున్నారు.
Also Read : రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక.. భారతీయ రైల్వే కొత్త నిబంధనలు ఇవే
శాస్త్రాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజున (జులై13న) పరమేశ్వరుడిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, శత్రు బాధలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు, మానసిక ఆందోళనల్లో ఉన్నవారు శివారాధన చేయడం వల్ల వారి బాధలు పోతాయట. అలాగే వ్యాపారాల్లో నష్టాలు ఎదుర్కొంటున్న వారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నవారు కూడా జులై 13న శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే వారి ఇబ్బందుల నుండి విముక్తి పొందేందుకు ఆస్కారం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తే లక్ష్మీదేవి, కుబేరుని కటాక్షం కూడా కలుగుతుందని, దాంతో ఐశ్వర్యం, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.
ఈరోజున పవిత్రమైన జలంలో బిల్వపత్రం వేసి శివయ్యను అభిషేకం చేయడం వల్ల జాతకంలో తీవ్రమైన ఇబ్బందులు పెట్టే గురు దోషాలు తక్షణమే తొలగిపోతాయి. వంశాన్ని పీడిస్తున్న పితృ శాపాలు, పితృ దోషాల నుంచి విముక్తి కలిగి, ఇంటిల్లిపాదికి ఆ సధాశివుని సర్వరక్షణ లభిస్తుందని నమ్ముతారు.
జులై 13వ తేదీన ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నీరు, పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేయాలి. బిల్వ దళాలు సమర్పించి.. పుష్పాలతో అలంకరించాలి. అన్యాభిషేకం చేయడం వలన శుభం కలుగుతుంది. ఓం నమ: శివాయ అని 108 సార్లు పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, శాంతి లభిస్తాయి. శివుని కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు.
పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారికి, జాతకంలో గురుబలం లేక సతమతం అవుతున్న యువతీ,యువకులకు జులై 13న చేసే శివారాధనతో కాలం కలిసొస్తుంది. అలాగే రుణ బాధల నుంచి విముక్తి కలగడంతోపాటు.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానంకోసం పరితపించే దంపతులకు ఈ శివరాత్రి వత్రం కల్పవల్లిగా మారుతుందని ప్రతీతి.
ఇది కేవలం పలువురు ఆధ్యాత్మిక పండితులు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రచురించిన కథనం మాత్రమే.
