Tirumala : వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండటంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది.
- chvmurthy
- Published On : May 17, 2022 / 07:29 AM IST
Pournami Garuda Seva
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండటంతో ఘటాటోపంతో వాహన సేవ జరిగింది.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయానికి చెందిన ఇతర అధికారులు పాల్గోన్నారు.
