Tirumala Garuda Seva శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో దర్శనమిచ్చారు.
- Subhan Ali Shaik
- Published On : December 19, 2021 / 09:35 PM IST
Tirumala Garuda Seva
Tirumala Garuda Seva: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ తిరుమల చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, వీజీఓ శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……………………………..: హైదరాబాద్‌లోనే రాధేశ్యామ్ నేషనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్!
