TTD SSD Tokens : శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? తిరుమలలో SSD, DD టోకెన్లు బంద్.. ఎప్పటివరకంటే?

TTD SSD Tokens : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 10 నుంచి 21 వరకు తిరుపతిలో SSD, DD టోకెన్ల పంపిణీ నిలిపివేశారు. అక్టోబర్ 23 దర్శన టోకెన్ల జారీ సమయం, పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Tirumala Darshan Alert

  • తిరుమల యాత్రకు వెళ్లేవారికి ముఖ్య గమనిక.. తేదీలు చూసుకోండి
  • తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 12 రోజుల పాటు టోకెన్ల పంపిణీ బంద్
  • అక్టోబర్ 23న శ్రీవారి దర్శనమా? టోకెన్ల సమయం ఇదే

TTD SSD Tokens : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో బిగ్ అలర్ట్.. మీ తిరుమల యాత్ర ప్రణాళికలో మార్పులు చేసుకోండి. టీటీడీ తిరుపతిలోని దర్శన టోకెన్ల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, దర్శన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజులపాటు టోకెన్ల పంపిణీని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ 10 నుంచి 21 వరకు టోకెన్లు బంద్ :
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కేంద్రాల్లో జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం (SSD), దివ్యదర్శనం (DD) టోకెన్ల పంపిణీని అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు నిలిపివేయనున్నారు. ఈ నిర్ణయంతో ఆయా కేంద్రాల్లో టోకెన్లు తీసుకుని దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం బెటర్.

Read Also : Aadhaar TOTP Verification : ఆధార్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. SMS OTP రావడం లేదా? TOTPతో ఇలా చేయండి!

ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు టోకెన్ల లభ్యతను ముందుగానే తెలుసుకోవడం మంచిది. కుటుంబాలతో కలిసి యాత్రకు వెళ్లేవారు కూడా ముందే తెలుసుకోవాలి. టోకెన్లు అందుబాటులో ఉంటాయని భావించి తిరుపతికి వస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడక తప్పదు.

అక్టోబర్ 23 దర్శనానికి టోకెన్లు? :
అక్టోబర్ 23, 2026న శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు అక్టోబర్ 22వ తేదీ ఉదయం 4 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. దర్శన తేదీకి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

టీటీడీ తీసుకునే నిర్ణయాలు, టోకెన్ల జారీ విధానంలో మార్పులపై భక్తులు ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనలను తెలుసుకుంటూ ఉండాలి. దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకున్న తర్వాతే ప్రయాణం ప్లాన్ చేసుకోవడం బెటర్. శ్రీవారి దర్శనం సజావుగా పూర్తయ్యేలా భక్తులు టీటీడీ సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.