Aadhaar TOTP Verification : ఆధార్ వెరిఫికేషన్ చాలా ఈజీ.. SMS OTP రావడం లేదా? TOTPతో ఇలా చేయండి!
Aadhaar TOTP Verification : ఆధార్ ఎస్ఎంఎస్ ఓటీపీ రాకపోతే టీఓటీపీతో వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి? ఆధార్ యాప్‌లో 8 అంకెల కోడ్ పొందే విధానం, ఫోన్ సెట్టింగ్స్, సేఫ్టీ బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Aadhaar TOTP Verification
- ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్.. SMS OTP లేకుండానే వెరిఫికేషన్
- ఓటీపీ రావడం లేదా? ఈ సదుపాయంతో మీ పని ఈజీ
- ఆధార్ యాప్‌లో ఈ ఫీచర్ తెలుసా? OTP సమస్యలకు పరిష్కారం
Aadhaar TOTP Verification : ఆధార్ కార్డుతో ఎస్ఎంఎస్, ఓటీపీ రెండూ రావడం లేదా? డోంట్ వర్రీ.. ఆన్లైన్ ఆధార్ సేవల కోసం SMS ద్వారా వచ్చే OTP కోసం ఇకపై ఎదురుచూడాల్సిన పనిలేదు. మొబైల్ నెట్వర్క్ సరిగా లేకున్నా మెసేజ్ ఆలస్యంగా వస్తున్నా వెరిఫికేషన్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి సమస్యలకు ప్రత్యామ్నాయంగా (TOTP) ఫీచర్ అందుబాటులో ఉంది. సంబంధిత ఆధార్ సర్వీసు సెంటర్ ద్వారా ఈ విధానాన్ని తెలుసుకోవచ్చు.
టీఓటీపీ ఏంటి? :
టీఓటీపీ అంటే.. టైమ్ బేస్డ్ వన్ టైమ్ పాస్వర్డ్. నిర్దిష్ట సమయానికి మాత్రమే వ్యాలీడ్ అయ్యే సెక్యూరిటీ కోడ్. ఆధార్ యాప్‌లో టీఓటీపీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా 8 అంకెల కోడ్‌ను పొందవచ్చు. ఈ కోడ్ ప్రతి 30 సెకన్లకు మారుతుంది. SMS రూపంలో మెసేజ్ వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు.
ఆధార్ యాప్‌లో టీఓటీపీ పొందడం ఎలా? :
ముందుగా మీ ఫోన్లో అధికారిక ఆధార్ యాప్ ఓపెన్ చేయండి. వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి యాప్‌లోకి వెళ్లండి. ఆపై TOTP లేదా జనరేట్ TOTP అనే ఆప్షన్ అందుబాటులో ఉంటే అదే ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపించే కోడ్‌ను గుర్తించాలి. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో అడిగిన చోట ఎంటర్ చేయాలి. కోడ్ ఎక్స్ పెయిర్ ముగిసిన తర్వాత ఆ కోడ్ వాడలేరు. అలాంటప్పుడు కొత్త కోడ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఫోన్ సెట్టింగ్స్‌లో ఇది మర్చిపోవద్దు :
టీఓటీపీ ఈజీగా వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో డేట్, టైమ్ కచ్చితంగా ఉండాలి. ఇందుకోసం మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి (Automatic Date and Time) ఆప్షన్ ఆన్ చేయాలి. ఆటోమేటిక్ టైమ్ జోన్‌ను కూడా ఎనేబుల్ చేయాలి. సమయం తప్పుగా ఉంటే కోడ్ వెరిఫికేషన్ ఇష్యూ రావచ్చు.
టీఓటీపీ విషయంలో జాగ్రత్తలివే :
ఈ సదుపాయంతో నెట్వర్క్ సమస్యలు ఉన్నప్పుడు కొంతవరకు వెసులుబాటు లభిస్తుంది. అయితే, అన్ని ఆధార్ సర్వీసుల్లో టీఓటీపీ పనిచేయకపోవచ్చు. కొన్ని సేవల్లో ఎస్ఎంఎస్ ఓటీపీ మాత్రమే అందుబాటులో ఉండొచ్చు. అందుకే ముందుగా సంబంధిత సర్వీసులో టీఓటీపీ సదుపాయం ఉందో లేదో చెక్ చేసుకోవడం బెటర్.
అలాగే, ఆధార్ యాప్‌ను సేఫ్‌గా ఉంచుకోవాలి. ఓటీపీ లేదంటే టీఓటీపీ కోడ్‌ను ఇతరులతో షేర్ చేయొద్దు. అనుమానాస్పద వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయొద్దు. అధికారిక యాప్‌లు, విశ్వసనీయ సర్వీసులను మాత్రమే వినియోగించాలి.
మొత్తంగా, SMS OTP ఆలస్యమైనా TOTP ద్వారా ఈజీగా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. సరైన ఫోన్ సెట్టింగ్స్‌తో పాటు సంబంధిత సర్వీసు సపోర్టు ఉంటే చాలు.. ఆధార్ వెరిఫికేషన్ చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు.
