Toli Ekadashi 2026 : తొలి ఏకాదశి రోజున ఈ పనులు అస్సుల చేయొద్దు.. కారణాలివే? ఒకవేళ అలా చేశారంటే..
Toli Ekadashi 2026 : తొలి ఏకాదశి ఘడియలు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ సూర్యోదయం వేళ.. ఏ తిథి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు. దాంతో తొలి ఏకాదశి శనివారంగా పరిగణిస్తారు.
- Harish Thanniru
- Published on- July 24, 2026 / 11:48 AM IST
Toli Ekadashi 2026
Toli Ekadashi 2026 : భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి. అనగా తొలి ఏకాదశి. దీనిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, ఈరోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
Also Read : Gold And Silver PriceToday : బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. గోల్డ్ ఇప్పుడే కొనేయండి..! తులం ఎంతంటే?
తొలి ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే, ఆషాఢ శుక్ల ఏకాదశికి “తొలి ఏకాదశి” అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి దీనిని తొలి ఏకాదశి లేదంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తున్నాయి.
తొలి ఏకాదశి తిథి..
తిథి ప్రారంభం: జులై 24 శుక్రవారం ఉదయం 10.08 గంటలకు.
తిథి ముగింపు: జులై 25 శనివారం ఉదయం 11.54 గంటలకు.
తొలి ఏకాదశి ఘడియలు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. కానీ సూర్యోదయం వేళ.. ఏ తిథి ఉంటే దానిని పరిగణలోకి తీసుకుంటారు. దాంతో తొలి ఏకాదశి శనివారంగా పరిగణిస్తారు. ఇక ఈ రోజు.. పెద్దలకు బట్టలు పెడితే మంచిది. అంటే.. కొత్త వస్త్రాలు కొనుగోలు చేసి.. వాటిని దేవుని వద్ద ఉంచాలి. పూజ అయిన తర్వాత.. ఆ వస్త్రాలను ఎవరో ఒకరికి దానంగా ఇవ్వాలి. కొన్ని రోజుల తర్వాత అయినా వాటిని పెద్దలకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల.. కుటుంబానికి మంచి జరుగుతుందని పెద్దలు చెబుతారు.
ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ (హిందూ సాంప్రదాయంలో ఉపవాసాన్ని విరమించి లేదా ముగించి ఆహారం స్వీకరించడాన్ని పారణ అంటారు) చేసినవారు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని పండితులు పేర్కొంటున్నారు.
తొలి ఏకాదశి రోజున ఇలా చేయండి..
♦ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి.
♦ స్నానం చేసి శ్రీమహావిష్ణువు, శ్రీలక్ష్మీ దేవిని పూజించాలి.
♦ ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.
♦ విష్ణు సహస్ర నామం చదవాలి
♦ భగవద్గీత పారాయణం చేయాలి
♦ తులసి దళాలతో శ్రీమహా విష్ణువును ఆరాధించాలి.
♦ శ్రీహరికి నైవేద్యంలో.. పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉంచాలి.
♦ ద్వాదశి రోజున అన్నదానం చేయాలి.. వస్త్రాలు దానంగా ఇవ్వాలి.
♦ విధిగా పారాయణం చేయాలి.
ఏం చేయకూడదంటే..
♦ తామసిక ఆహారం తినవద్దు
♦ పెద్దలు, స్త్రీలను అవమానించొద్దు.
♦ ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి.
♦ తులసి ఆకులను మొక్క నుంచి తెంప వద్దు
♦ ఉపవాసం ఉన్న వ్యక్తి.. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు.
♦ ఈరోజు స్త్రీలు తలస్నానం చేయకూడదు.
♦ గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.
♦ మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి.
