TTD: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుపతి చేరుకుని శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా మూడు లేదా నాలుగు రోజుల వేచి ఉండాల్సిన పరిస్థితి...
- Subhan Ali Shaik
- Published On : February 20, 2022 / 06:37 PM IST
Ttd
TTD: తిరుపతి చేరుకుని శ్రీవారి సర్వదర్శనం కోసం ఎదురుచూసే భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా మూడు లేదా నాలుగు రోజుల వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపింది. తిరుపతిలో ఆదివారం ఫిబ్రవరి 20న టోకెన్లు పొందిన భక్తులు ఫిబ్రవరి 24వ తేదీ వరకూ దర్శనం కోసం వేచి ఉండాలి.
దర్శనానికి వచ్చేవారు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకునే తిరుపతికి రావాలంటూ టీటీడీ విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడొద్దంటూ టీటీడీ సూచనలు ఇచ్చింది.
తిరుపతి లో శ్రీవారి దర్శనం కోసం ఆఫ్ లైన్ ద్వారా రోజుకు 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ.
