Shravana Masam 2026 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు.. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇదే..

Shravana Masam 2026 : శ్రావణమాసంలో ఎంతో నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతోపాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

why not eat non veg during Shravana Masam spiritual significance

Shravana Masam 2026 : శ్రావణ మాసంలో అధికశాతం మంది తమ ఇండ్లలో, ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వ్రతాలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఉపవాసాలు ఉంటూ భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శివుడు, పార్వతీ దేవి, విష్ణువులను ఆరాధిస్తూ భక్తులు ఈ నెలలో వివిధ పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా సోమవారాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేస్తారు. శుక్రవారాల్లో అమ్మవారిని భక్తిశ్రద్దలతో ఆరాధిస్తారు. నాగ పంచమి, రక్షాబంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పర్వదినాలు కూడా ఈ కాలంలోనే వస్తాయి.

Also Read : Chatgpt Finds Lost Footwear : రేయ్ ఏంట్రా ఇది.. మరీ టూమచ్.. గుళ్లో కలిసిపోయిన చెప్పులు వెతకడానికి ChagGPT వాడతావా?

శ్రావణమాసంలో ఎంతో నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మిక విశ్వాసంతోపాటు ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం.. శ్రావణమాసంలో మాంసాహారం తామసిక ఆహారంగా (ఆయుర్వేదం, భగవద్గీత ప్రకారం.. శరీరంలో బద్ధకం, నిద్రమత్తు, అజ్ఞానం, జడత్వాన్ని పెంచే వాటిని తామసిక ఆహారం అంటారు.) భావించి దూరంగా ఉంటారు. ఇది బద్దకం, చంచలత్వం వంటి భావాలను పెంచుతుందని కొన్ని సంప్రదాయాలు చెబుతాయి. మాంసాహారాన్ని పక్కన పెట్టి కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలని పండితులు చెబుతారు.

మరోవైపు.. శ్రావణ మాసం సాధారణంగా వర్షాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. మాంసాహారం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కడుపులో ఇన్ఫెక్షన్లు, అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఈ కాలంలో తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తుంటారు.

శ్రావణ మాసంలో మాంసాహారాన్ని మానేయడం అనేది చాలామందికి ఒక ఆధ్యాత్మిక నియమం అయితే.. మరికొందరికి ఆహార నియంత్రణలో భాగం. ప్రాంతం, కుటుంబ సంప్రదాయం, వ్యక్తిగత విశ్వాసాలను బట్టి ఈ ఆచారాలు మారుతూ ఉంటాయి.