టెండూల్కర్ జోస్యాన్ని కోహ్లీ నిజం చేస్తాడా? మొదటి అడ్డు వార్నర్

  • Publish Date - September 21, 2020 / 06:56 PM IST

IPL2020, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad: ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు సూపర్ డూపర్ అనిపించుకొని క్లైమాక్స్ లో తుస్సుమనిపించే జట్టు ఏమైనా ఉందంటే అది బెంగుళూరు రాయల్స్. అందరూ స్టార్సే. క్రేజ్‌కు ఢోకా ఉండదు. ఖర్చు ఎక్కువ. ఇంతవరకు ఒక్క ట్రీఫీ గెలవలేదు.

IPL superstarsలందరినీ కుప్పపోసినట్లే ఉంటుంది బెంగుళూరు రాయల్స్. supporters కోట్లలో ఉన్నారు. వాళ్ల కళ్లలో బోల్డంత ఆశ. ఈసారైనా ట్రీఫీ పడతారని. ఇప్పటికి వరకు 12 సీజన్స్‌లో ఆడారు. ట్రీఫీ అందితే ఒట్టు.



కోహ్లీ టీం అరుపులు కేకలతో హోరెత్తితే, బుద్ధిమంతుడిలా తనపని తాను చేసుకెళ్లే టీం Sunrisers Hyderabad. టీం గురించి ఇరగదీసి మాట్లాడేది ఉండదు. అయినా 2016 నుంచి రెగ్యలర్‌గా playoffsకి వెళ్తూనే ఉన్నారు. టైటిల్ గెల్చారు.2018 రన్నర్ అప్‌గా నిల్చారు.

ఈసారి కొట్టే టీంతో వచ్చానని అంటున్నాడు కోహ్లి. ఇప్పటిదాకా బెంగుళూరుకు కొన్ని సమస్యలున్నాయి. ఒకటి. Virat Kohli, AB de Villiersమీదనే ఎక్కువగా ఆధారపడటం. రెండోది.. చివరి ఓవర్లలో ఎక్కువగా రన్స్ ఇవ్వడం. అందుకే Aaron Finchను తెచ్చుకుంది. బాగా ఖర్చు చేసి Chis Morrisను కొనుక్కొంది. నమ్మదగ్గ Dale Steynను చేర్చుకుంది. 2019లో రెండుమూడు మ్యాచ్‌ల్లోనే నిప్పులు కురిపించాడు.



Sunrisersకి అన్ని కష్టాల్లేవ్. జట్టులో పూడ్చదగ్గ కన్నాలూ లేవ్. Fabian Allen, Abdul Samadలను తక్కువ రేటుకు కొనుక్కొంది. ఇద్దరు మంచి ఆటగాళ్లు.

రెండు ధృవాల్లాంటి ఇద్దరూ పిచ్ మీద మాత్రం ఈక్వెల్. 2018 నుంచి ఈ రెండు జట్లు ఓడి గెల్చాయి. మొత్తం మీద 8-6 ఎడ్వాంటేజ్ సన్‌రైజర్స్‌దే.