గెలుపు మనదే.. సిరీస్ మనదే : Super Overలో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

  • Publish Date - January 29, 2020 / 10:57 AM IST

హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సూపర్ ఓవర్ లో కివీస్ పై కోహ్లి సేన విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో కివీస్ విధించిన 18 పరుగుల టార్గెట్ ను టీమిండియా చేధించింది. సూపర్ ఓవర్ తో మూడో టీ-20లో ఫలితం తేలింది.

సూపర్ ఓవర్ లో భారత జట్టు 20 పరుగులు చేసింది. ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ 17 రన్స్ చేసింది. సూపర్ ఓవర్ లో చివరి రెండు బంతులకు రెండు సిక్స్ లు బాదిన రోహిత్ శర్మ.. జట్టుని గెలిపించాడు. ఈ గెలుపుతో 3-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 

* మూడో టీ-20లో భారత్ విజయం
* సూపర్ ఓవర్ తో తేలిన ఫలితం
* 17 పరుగులు చేసిన కివీస్
* 20 పరుగులు చేసిన భారత్
* సూపర్ ఓవర్ స్కోర్లు: న్యూజిలాండ్-17/0.. భారత్-20/0

* సూపర్ ఓవర్ లో చివరి రెండు బంతులు సిక్స్ లు బాదిన రోహిత్ శర్మ
* 5 టీ-20 మ్యాచ్ ల సిరీస్.. 3-0తో సిరీస్ భారత్ కైవసం
* తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా..20 ఓవర్లలో 179/5
* 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసిన న్యూజిలాండ్
* మరో 2 మ్యాచులు ఉండగానే సిరీస్ కైవసం
* న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ భారత్ గెలవడం ఇదే తొలిసారి

ట్రెండింగ్ వార్తలు