Rohit Sharma : రోహిత్ శర్మ బర్త్‌డే.. తల్లి పూర్ణిమ చేసిన పని వైరల్..
రోహిత్ శర్మ 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 30, 2024 / 03:05 PM IST
Rohit Sharma
Rohit Sharma birthday : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన పని లేదు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత జట్టుకు మరుపురాని విజయాలను అందించాడు. ఇక అభిమానులు అతడిని ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. కాగా.. నేడు రోహిత్ శర్మ 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతడికి సెలబ్రెటీలు, అభిమానులు, నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీమ్ జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజలు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యేక ఫోటోలను పోస్ట్ చేయగా, ముంబై ఇండియన్స్ ‘సలామ్ రోహిత్ భాయ్’ అంటూ ఓ పాటను పంచుకుంది. ఈ పాట అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇక రోహిత్ శర్మ అమ్మ పూర్ణిమ శర్మ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. హిట్‌మ్యాన్ టీనేజ్‌లో ఉండగా తల్లితో కలిసి దిగిన ఫోటో అది. ఈ పిక్ వైరల్‌గా మారగా.. టీనేజ్‌లో రోహిత్ చాలా చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Kaviya Maran : ‘అయ్యో భగవంతుడా..?’ అంటూ కావ్యా పాప రియాక్షన్.. ఇలా చేస్తారని అనుకోలేదు!
A cute picture of Young Rohit Sharma shared by his mother on birthday ? pic.twitter.com/oNszwvnOU2
— Johns. (@CricCrazyJohns) April 30, 2024
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రోహిత్ శర్మ ఐపీఎల్ 17వ సీజన్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడాడు. 160.31 స్ట్రైక్‌రేటుతో 311 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై సెంచరీ చేశాడు. కాగా.. నేడు లక్నోలోని ఎకానా స్టేడియంలో ముంబై, లక్నో జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి రోహిత్ శర్మకు పుట్టిన రోజు కానుక ఇవ్వాలని ముంబై ఆటగాళ్లు భావిస్తున్నారు.
LSG vs MI : కీలక మ్యాచ్‌కు ముందు లక్నోకు గుడ్‌న్యూస్.. హార్దిక్ సేన కష్టాలు రెట్టింపు?
