Abhishek Sharma equals these Indian batters with this T20I feat
Abhishek Sharma : టీమ్ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియాకప్ 2025లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ బాదాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ లు అంతకముందు ఈ ఘనత సాధించారు. అలాగే ఛేజింగ్ లో ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాటర్ గా కూడా అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పాడు.
అంతర్జాతీయ టీ20ల్లో తొలి బంతికే సిక్స్ కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – ఇంగ్లాండ్ పై (2021లో అహ్మదాబాద్‌లో)
* యశస్వి జైస్వాల్ – జింబాబ్వే పై (2024లో హరారేలో)
* సంజూ శాంసన్ – ఇంగ్లాండ్ పై (2025లో ముంబైలో)
IND vs UAE : 2 గంటల్లోపే ముగిసిన మ్యాచ్.. పూర్తి మ్యాచ్ ఫీజు వస్తుందా? రాదా? సూర్య ఏమన్నాడంటే?
Indian batters to hit first ball of the innings in T20I for a Six:
1) Rohit Sharma
2) Yashasvi Jaiswal
3) Sanju Samson
4) Abhishek Sharma pic.twitter.com/zsvxbJruKR— Johns. (@CricCrazyJohns) September 11, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ బ్యాటర్లలో ఓపెనర్లు అలిషన్ షరాఫు (22), మహ్మద్ వసీమ్ (19) లు రాణించారు. మిగిలిన ఆటగాళ్లలో ఎవ్వరూ కూడా కనీసం మూడు పరుగులు కూడా దాటలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. శివమ్ దూబె మూడు వికెట్లు సాధించాడు. బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (30; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది. శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (7 నాటౌట్; 2 బంతుల్లో 1 సిక్స్) మెరుపులు మెరిపించారు.
ఈ మెగాటోర్నీలో భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాక్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 14 ఆదివారం దుబాయ్ వేదికగానే మ్యాచ్ జరగనుంది.