Afghanistan
Afghanistan vs Australia : టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ సూపర్-8 మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. పదునైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు అఫ్గాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 19.2 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమేచేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఫలితంగా 21 పరుగుల తేడాతో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై గెలవడం అఫ్గాన్ జట్టుకు ఇదే తొలిసారి కావటం గమనార్హం.
Also Read : భారత్‌తోపాటు అఫ్గానిస్థాన్ జట్టు సెమీస్‌కు వెళ్లాలంటే ఏం చేయాలి?
బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీ జద్రాన్ (51). అదేవిధంగా బౌలింగ్ విభాగంలో గుల్బాదిన్ నైబ్ (4వికెట్లు20 పరుగులు), నవీనుల్ హక్ (3వికెట్లు 20 పరుగులు) అద్భుతంగా రాణించి అఫ్గాన్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. ఆస్ట్రేలియాపై అద్భుత విజయం తరువాత అఫ్గాన్ ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఊహించని విజయం సొంతం కావడంతో అఫ్గాన్ ప్లేయర్లతోపాటు మైదానంలో అఫ్గానిస్థాన్ ఫ్యాన్స్ సంబరాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
THE HISTORIC MOMENT. ?
– AFGHANISTAN DEFEATED AUSTRALIA FOR THE FIRST TIME EVER…!!!!! pic.twitter.com/u1gzTvT02C
— Johns. (@CricCrazyJohns) June 23, 2024