Afghanistan Rashid Khan: మా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి – రషీద్ ఖాన్

అఫ్గనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్.. ట్విట్టర్ వేదికగా తమ దేశాన్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ గందరగోళం నుంచి కాపాడి శాంతి ప్రసాదించాలంటూ ప్రపంచ నాయకులకు సందేశం పంపారు.

Afghanistan Rashid Khan: అఫ్గనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్.. ట్విట్టర్ వేదికగా తమ దేశాన్ని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. ఈ గందరగోళం నుంచి కాపాడి శాంతి ప్రసాదించాలంటూ ప్రపంచ నాయకులకు సందేశం పంపారు. మానవత్వం కొరవడి సంక్షోభం ఏర్పడిన క్రమంలో వేల కుటుంబాలు హింసకు గురవుతున్నాయని, చిన్నారులు, మహిళలని కూడా ఉపేక్షించకుండా హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ప్రపంచ నాయకులారా.. నా దేశం గందరగోళంలో పడి ఉంది. చిన్నారులు, మహిళలతో సహా వేల మంది అమాయకులు ప్రతిరోజూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇల్లు, ఆస్తులు అన్నీ ధ్వంసం అవుతున్నాయి. వేల మంది కుటుంబాలను కోల్పోతున్నారు. మమ్మల్ని ఈ గందరగోళంలో వదిలేయకండి. అఫ్గాన్ చావులను ఆపండి, అఫ్గానిస్తాన్ ను నాశనం చేయకండి. మేం శాంతి కోరుకుంటున్నాం’ అంటూ అంతర్జీతయ క్రికెట్ స్పిన్నర్ ట్వీట్ చేశాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లోనే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ కీలకమైపోయాడు రషీద్ ఖాన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో తెలుగోళ్లకు బాగా కనెక్ట్ అయిపోయాడు. అక్టోబర్ – నవంబర్ మధ్యలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో కీలక ప్లేయర్ కానున్నాడు రషీద్.

కొద్ది నెలలుగా అఫ్గానిస్తాన్ లో జాతీయ బలగాలకు, తాలిబాన్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ఈ హింస తారాస్థాయికి చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు