IND vs AFG : బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌.. క‌న్‌ఫాం చేసిన బీసీసీఐ.. ఎప్ప‌టి నుంచంటే?

భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య (IND vs AFG) టీ20 సిరీస్‌కు రంగం సిద్ధ‌మైంది.

Afghanistan To Host India For Three-Match T20I Series In Delh

IND vs AFG : భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య టీ20 సిరీస్‌కు రంగం సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 13 నుంచి 17 వ‌ర‌కు భార‌త్‌, అఫ్గాన్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. భార‌త‌దేశంలో టీమ్ఇండియాకు అఫ్గాన్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ విష‌యాన్ని బీసీసీఐ, అప్గాన్ క్రికెట్ బోర్డులు వెల్ల‌డించాయి.

ఈ సిరీస్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. ‘అఫ్గాన్‌లో క్రికెట్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి, అక్కడి ఆటగాళ్లకు అత్యున్నత స్థాయిలో పోటీపడే అవకాశాలను కల్పించడానికి బీసీసీఐ కట్టుబడి ఉంది. ద్వైపాక్షిక క్రికెట్ ఇందులో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఇది జట్లకు నాణ్యమైన ప్రత్యర్థులతో క్రమం తప్పకుండా ఆడి, విలువైన అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సిరీస్ కోసం అఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డును భారతదేశానికి స్వాగతిస్తున్నాము. దీనిని విజయవంతం చేయడానికి వారితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము. రెండు క్రికెట్ దేశాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తూనే అఫ్గాన్‌ క్రికెట్‌కు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తాము.’ అని అన్నారు.

Hardik Pandya : గిల్‌కు ఎస‌రు పెట్టిన‌ హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ ఇస్తే వ‌స్తా.. గుజరాత్‌కు ఆఫ‌ర్‌..! షాకిచ్చిన జీటీ!

బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు భార‌త్‌లో టీమ్ఇండియాకు టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ప‌ట్ల బీసీసీఐ సంతోషంగా ఉంది. భార‌త్‌, అఫ్గాన్ జ‌ట్ల మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా మ్యాచ్‌లు ఉత్కంఠ‌గా సాగుతున్నాయి. ఇరు జట్లలోనూ నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. అఫ్గాన్‌ ఆటగాళ్లలో చాలా మంది భార‌త దేశంలో అభిమానులు ఉన్నారు. ఇది ఈ రెండు క్రికెట్ దేశాల మధ్య ఏర్పడిన బలమైన బంధానికి నిదర్శనం. 2018లో అఫ్గాన్‌కు వారి చారిత్రాత్మక తొలి టెస్ట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఈ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి. అప్పటి నుండి, ఇరు జట్ల మధ్య క్రమం తప్పకుండా ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరుగుతూనే ఉన్నాయి.’ అని చెప్పుకొచ్చారు.

భార‌త్‌, అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌..

* తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబ‌ర్ 13న‌
* రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబ‌ర్ 15న‌
* మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబ‌ర్ 17న
ఈ మూడు మ్యాచ్‌లు ఢిల్లీ వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి.

బంగ్లాకు షాక్..

వాస్త‌వానికి సెప్టెంబ‌ర్‌లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు కూడా భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌లో త‌ప్ప‌కుండా ప‌ర్య‌టిస్తుంద‌ని ఆ క్రికెట్‌ బోర్డు పెద్ద‌లు ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. అయితే.. అఫ్గాన్‌ను రంగంలోకి దించి బంగ్లాకు గ‌ట్టి షాక్ ఇచ్చింది బీసీసీఐ.

Cristiano Ronaldo : పెళ్లి చేసుకున్న పోర్చుగ‌ల్ ఫుట్‌బాల్ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో భార‌త్‌లో త‌మ‌కు భ‌ద్ర‌త లేదంటూ అప్ప‌టి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం ఐసీసీ వ‌ద్ద పంచాయ‌తీ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య అప్పుడున్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో భార‌త్‌కు వెళ్ల‌మ‌ని భీష్మించుకుని కూర్చుకుంది. ఐసీసీ.. బంగ్లాను ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఎలాంటి ఫ‌లితం లేక‌పోయింది. తాము అడిగిన‌ట్లు వేదిక‌ను మార్చ‌లేదు కాబ‌ట్టి, త‌మ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. దీంతో అప్ప‌టి నుంచి బీసీసీఐ, బంగ్లా బోర్డు సంబంధాలు దెబ్బ‌తిన్నాయి.