Cristiano Ronaldo : పెళ్లి చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో..
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo ) తన చిరకాల భాగస్వామి, మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ జార్జినా రోడ్రిగెజ్‌ను వివాహం చేసుకున్నారు.
Cristiano Ronaldo marry Georgina Rodriguez
Cristiano Ronaldo : పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన చిరకాల భాగస్వామి, మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ జార్జినా రోడ్రిగెజ్‌ను వివాహం చేసుకున్నారు. మంగళవారం (ఆగస్టు 11) పోర్చుగల్‌లో జరిగిన సివిల్ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
పెళ్లి ఉంగరాలతో ఉన్న తమ చేతుల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రొనాల్డో వెల్లడించాడు. అతడి పేరులోని మొదటి అక్షరం సి.. జార్జినా పేరులోని జే అక్షరాల మధ్య లవ్ సింబల్‌ను క్యాప్షన్‌గా ఇచ్చాడు. రొనాల్డోకు 41 ఏళ్లు కాగా జార్జినా రోడ్రిగెజ్‌కు 32 సంవత్సరాలు.
Sara Tendulkar : సచిన్ కూతురు మోడలింగ్ చేస్తోందా? సారా టెండూల్కర్ మోడ్రన్ ఫోటోలు వైరల్..
అర్జెంటీనా-స్పానిష్ మోడల్ అయిన జార్జినా రోడ్రిగెజ్‌తో రొనాల్డో పదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. గతంలో వీరిద్దరి పెళ్లిపై చాలా రూమర్లు రాగా.. ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేశారు.
View this post on Instagram
వీరిద్దరు తొలిసారి 2016లో కలుసుకున్నారు. స్పెయిన్ దిగ్గజ క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో ఆడుతున్న సమయంలో మాడ్రిడ్‌లోని ఓ గూచీ స్టోర్‌లో పనిచేస్తున్న జార్జినాను తొలిసారి కలిశాడు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తమ ప్రేమ బంధాన్ని మరుసటి ఏడాదే బాహ్య ప్రపంచానికి తెలిసేలా ప్రకటించాడు.
జార్జినా నటించిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ I Am Georginaలో రొనాల్డో తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలుత తమ బంధం ఇంత బలంగా మారుతుందని, తాను ఆమెతో ప్రేమలో పడతానని ఊహించలేదని చెప్పారు. రాను రాను తమ మధ్య బంధం చాలా బలపడిందని, తనే జీవిత భాగస్వామి అని భావించినట్లు తెలిపాడు.
ఏడాది క్రితమే నిశ్చితార్థం
రొనాల్డో, జార్జినా గత ఏడాది ఆగస్టు 11న తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. జార్జినా అప్పట్లో పెద్ద ఉంగరం ధరించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘అవును.. ఈ జీవితంలోనే కాదు, నా అన్ని జీవితాల్లోనూ’ అనే అర్థం వచ్చేలా స్పానిష్‌లో పోస్ట్ చేశారు.
ఈ జంటకు అలానా, బెల్లా అనే కుమార్తెలు ఉన్నారు. రొనాల్డో పెద్ద కుమారుడు క్రిస్టియానో జూనియర్, కవలలు ఎవా మారియా, మాటియోలను కూడా ఇద్దరూ కలిసి పెంచుతున్నారు.
1,000 గోల్స్‌కు చేరువలో రొనాల్డో..
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డో ప్రస్తుతం సౌదీ ప్రొ లీగ్‌లో అల్-నస్ర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన కెరీర్లో 1,000 ప్రొఫెషనల్ గోల్స్ మైలురాయికి ఆయన చేరువలో ఉన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ప్రపంచకప్‌లో ఆరోసారి పాల్గొని రికార్డు సృష్టించిన రొనాల్డో.. ప్రీక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.
