Ryan ten Doeschate : ఇంగ్లాండ్ సిరీస్ త‌రువాత‌.. భార‌త అసిస్టెంట్ కోచ్ ప‌ద‌వికి డ‌స్క‌టే రాజీనామా!

ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్ ముగిసిన త‌రువాత భార‌త అసిస్టెంట్ కోచ్ ప‌ద‌వికి ర్యాన్ టెన్ డ‌స్క‌టే రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

After England ODI Series Team India Coach Set To Resign

Ryan ten Doeschate : టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌నలో ఉంది. టీ20 సిరీస్‌లో ఘోర ప‌రాజ‌యం పాలైన భార‌త జ‌ట్టు ప్ర‌స్తుతం వ‌న్డే సిరీస్ ఆడుతోంది. కాగా.. ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ముగియ‌గానే త‌న ప‌ద‌వి నుంచి టీమ్ఇండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డ‌స్క‌టే వైదొల‌నున్న‌ట్లు స‌మాచారం. దీనిపై ఇప్ప‌టికే ర్యాన్ టెన్ డ‌స్క‌టే నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని, ఈ విష‌యాన్ని బీసీసీఐతో పాటు గౌత‌మ్ గంభీర్ కు కూడా చెప్పేసిన‌ట్లు తెలుస్తోంది.

రెండేళ్ల క్రితం భార‌త జ‌ట్టు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన డ‌స్క‌టే.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. లండన్‌లో నివసిస్తున్న తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో తక్కువ ప్రయాణాలు ఉండే బాధ్యతలను చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అధికారికంగా వైదొలిగే అవకాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

Jasprit Bumrah : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ఏకైక భార‌త బౌల‌ర్‌

డ‌స్క‌టేను భారత జట్టు సహాయ కోచ్‌గా నియమించడంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు గంభీర్ మెంటార్‌గా ఉన్న‌ప్పుడు ఆ జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్‌గా డ‌స్క‌టే ఉండేవాడు. ఇక గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డంతో త‌న‌తో పాటు డ‌స్క‌టేకు అవ‌కాశం ఇచ్చాడు.