SRH playoffs chances : గుజ‌రాత్ చేతిలో ఘోర ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జ‌ర‌గాల్సిందే..

గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేఆఫ్స్ (SRH playoffs chances) అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి

after massive defeat against GT do you know SRH playoffs chances in IPL 2026 (pic credit@ipl)

  • గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి
  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్లేఆఫ్స్ అవ‌కాశాలు కాస్త సంక్లిష్టం
  • మిగిలిన రెండు మ్యాచుల్లో గెల‌వాల్సిందే!

SRH playoffs chances : ఐపీఎల్ 2026లో భాగంగా మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 82 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఫ‌లితంగా ఎస్ఆర్‌హెచ్ నెట్‌ర‌న్‌రేటు (+0.331) దారుణంగా ప‌డిపోయింది. ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతానికి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్థానం మార‌కున్నా కూడా ప్లేఆఫ్స్ అవ‌కాశాలు మాత్రం కొద్దిగా క‌ష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెల‌వాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం 14 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. లీగ్ ద‌శ‌లో ఎస్ఆర్‌హెచ్ మ‌రో రెండు మ్యాచ్‌లు (మే 18న‌ చెన్నైతో, మే22న ఆర్‌సీబీతో) ఆడ‌నుంది.

SRH : స‌న్‌రైజ‌ర్స్ ఫోన్ నంబ‌ర్ ఇదే.. 0, 6, 11, 9, 14, 16, 2, 4, 3

రెండు మ్యాచ్‌లు గెలిస్తే..
ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ బెర్తును ఖ‌రారు చేసుకోవాలంటే స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లు.. చెన్నై, ఆర్‌సీబీపై విజ‌యం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు ఎస్ఆర్‌హెచ్ ఖాతాలో 18 పాయింట్లు ఉంటాయి. మెరుగైన ర‌న్‌రేటు క‌లిగి ఉంటే ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌స్తే టాప్‌-2లో కూడా చోటు ద‌క్కించుకోవ‌చ్చు.

ఒక మ్యాచ్‌లో గెలిస్తే ప‌రిస్థితి?
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. అప్పుడు స‌న్‌రైజ‌ర్స్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అయినా కూడా ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌తో పాటు నెట్‌ర‌న్‌రేటు పై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ఇందుకోసం నెట్‌ర‌న్‌రేటును మెరుగు ప‌ర‌చుకోవాల్సి ఉంటుంది.

Pat Cummins : గుజ‌రాత్ పై ఘోర ఓట‌మి.. స్పందించిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌.. ఎంతో సంతోషంగా ఉంది..

రెండు మ్యాచ్‌లు ఓడిపోతే..
మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతే అప్పుడు ప్లేఆఫ్స్ ఛాన్స్ సంక్లిష్టం అవుతుంది. 14 పాయింట్లే ఎస్ఆర్‌హెచ్ ఖాతాలో ఉంటాయి. నాలుగో స్థానంతోనైనా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవ‌కాశం ఉంది. 14 పాయింట్లు సాధించిన మిగిలిన జ‌ట్ల కంటే ఎస్ఆర్‌హెచ్ ర‌న్‌రేటు మెరుగ్గా ఉండ‌డంతో పాటు మూడు కంటే ఎక్కువ జ‌ట్లు ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు.