MS Dhoni : సీఎస్‌కేలో వాటాల కొనుగోలుకు ధోని ఆసక్తి? దెబ్బతిన్న సంబంధాలు..?
ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni ) అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Updated on- August 25, 2026 / 04:01 PM IST
After Stake Talks Fall Apart MS Dhoni and CSK Relationship In Trouble Report
MS Dhoni : ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) నుంచి మహేంద్రుడు సీఎస్‌కే తరుపుననే ఆడుతున్నాడు. ఆ జట్టు తరుపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా, అలాగే ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని కొనసాగుతున్నాడు.
తన క్రికెట్ కెరీర్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో తలా సీఎస్‌కేతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్‌కే ఫ్రాంచైజీలో వాటాలు కొనుగోలు చేసేందుకు ధోని ప్రయత్నించాడని, అయితే.. వాటా శాతంపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఒప్పందం ముందుకు సాగలేదని సదరు వార్తల సారాంశం.
Womens Asia Cup 2026 : ఆసియాకప్ 2026 కోసం పాకిస్థాన్ మాస్టర్ ఫ్లాన్..
ఆంగ్ల మీడియాలో కథనాల ప్రకారం.. ధోని తొలుత సీఎస్‌కేలో 25 శాతం కొనుగోలు చేస్తానని చెప్పాడట. అయితే.. ఫ్రాంఛైజీ మాత్రం కేవలం 3 శాతం వాటా ఇవ్వడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు చెప్పిందట. దీంతో ధోని తన డిమాండ్‌ను 20 శాతానికి తగ్గించుకున్నప్పటికి యాజమాన్యం తమ ఆఫర్‌ను 4 శాతానికే పరిమితం చేసిందట. ఈ సారి ధోని 18 శాతం వాటాను కావాలని అడిగినప్పటికి కూడా సీఎస్‌కే యాజమాన్యం 5.5 శాతం మాత్రమే ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక ధోనీ, సీఎస్‌కే యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు కేవలం మౌఖికంగానే జరిగాయని, ఎలాంటి అధికారిక రాతపూర్వక ప్రతిపాదనలు చేయలేదని సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణాల నేపథ్యంలో సీఎస్‌కేతో ధోని సంబంధాలు దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సీఎస్‌కే 4 కోట్లతో ధోనిని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
