×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక ఘోర వైఫ‌ల్యం.. హెడ్ కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య కీల‌క నిర్ణ‌యం.. ఇక చాలు, త‌ప్పుకుంటా..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 (T20 World Cup 2026) నుంచి శ్రీలంక నిష్ర్క‌మించ‌గానే హెడ్ కోచ్ ప‌ద‌వికి స‌నత్ జ‌య‌సూర్య రాజీనామా చేశారు.

After T20 World Cup 2026 Failure Sri Lanka head coach Sanath Jayasuriya decided to resign from his role

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో శ్రీలంక ఘోర వైఫ‌ల్యం
  • కీల‌క నిర్ణ‌యం తీసుకున్న స‌న‌త్ జ‌య‌సూర్య‌
  • హెడ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా

T20 World Cup 2026 : శ్రీలంక క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి లంక జ‌ట్టు నిష్ర్క‌మించ‌గానే హెడ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని స‌నత్ జ‌య‌సూర్య నిర్ణ‌యించుకున్నారు. శ‌నివారం పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 ప‌రుగుల తేడాతో లంక జ‌ట్టు ఓడిపోయిన త‌రువాత జ‌య‌సూర్య ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. వాస్తవానికి టీ20 ప్రపంచ కప్ 2026 తన చివరి అసైన్‌మెంట్‌ అని ఆయన ముందుగానే చెప్పాడు.

పాక్‌తో మ్యాచ్ కన్నా ముంద‌గానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో శ్రీలంక రేసు ముగిసింది. ఆ జ‌ట్టు గ్రూప్ ద‌శ‌లో అద్భుతంగా ఆడింది. అయితే.. సూప‌ర్‌-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

IND vs WI : వెస్టిండీస్‌తో కీల‌క మ్యాచ్‌.. భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు..

శ‌నివారం ప‌ల్లెక‌ల్లె వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (100; 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. ఫఖర్ జమాన్ (84; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మధుశంక మూడు, దాసున్ శ‌న‌క రెండు, చ‌మీర ఓ వికెట్ తీశారు.

ఆ త‌రువాత భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో లంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. లంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ దాసున్ శ‌న‌క (76 నాటౌట్; 31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), పవన్ రాత్నాయక్ (58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. పాక్ బౌల‌ర్ల‌లో అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు.

బోర్డుకు ఇంకా చెప్ప‌లేదు..

పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన త‌రువాత జ‌య‌సూర్య మాట్లాడుతూ.. తాను హెడ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. వేరొక‌రికి ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నాడు. తాను హెడ్ కోచ్‌గా ఎక్కువ కాలం ఉండ‌న‌న్న విష‌యాన్ని ఇంగ్లాండ్‌తో సిరీస్ అప్పుడే చెప్పాన‌న్న విష‌యాన్ని గుర్తు చేశాడు. జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్భుతంగా ఆడి ఉంటే.. మంచి కోచ్‌గా ముగింపు ఇవ్వాల‌ని భావించాన‌ని, అయితే అలా జ‌ర‌గ‌లేద‌న్నాడు. ఇందుకు చాలా బాగా ఉంద‌న్నాడు.

T20 World Cup 2026 : ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాక్‌ ఔట్‌.. కెప్టెన్సీ పై స‌ల్మాన్ అలీ అఘా హాట్ కామెంట్స్‌.. ఇంటికి వెళ్లాక తీరిగ్గా..

త‌న ఒప్పందం జూన్ వ‌ర‌కు ఉంద‌న్నాడు. ఈ విష‌యం గురించి (రాజీనామా) గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఇంకా చెప్ప‌లేద‌న్నాడు. ఈ నిర్ణ‌యం పై వారితో చ‌ర్చించాల్సి ఉంద‌న్నాడు.