ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ కంటే ముందు టీమిండియా ఏయే టోర్నీల్లో పాల్గొంటుందో తెలుసా?

జులైలో వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టు మ్యాచులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత...

Team India

ODI World Cup 2023 – India: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC – 2023) ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా (Team India) చిత్తుగా ఓడిన నేపథ్యంలో ఇక భారత ఫ్యాన్స్ దృష్టి అంతా వన్డే ప్రపంచ కప్‌పై పడింది. ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో భారత్ లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది.

అందుకు సాధన చేయడానికి నాలుగు నెలల సమయం ఉంది. వన్డే ప్రపంచ కప్ కంటే ముందు రోహిత్ శర్మ సేన పలు ధ్వైపాక్షిక సిరీస్ లు, ఆసియా కప్ 2023 (Asia Cup 2023) ఆడాల్సి ఉంది. జులైలో వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టు మ్యాచులు, మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది.

వెస్టిండీస్ టూర్ అనంతరం టీమిండియా ఐర్లాండ్ వెళ్తుంది. మూడు టీ20 మ్యాచులు ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఆ తర్వాత సెప్టెంబరులో ఆసియా కప్ ఉంటుంది. ఈ టోర్నీ అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడాల్సి ఉంటుంది.

ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్‌ జరుగుతుంది. ఇక ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో భారత్ 5 టీ20లు ఆడుతుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.

Pro Panja League: జూలై 28 నుంచి ప్రో పంజా లీగ్.. స‌త్తా చాటేందుకు సిద్ద‌మైన కిరాక్ హైదరాబాద్

ట్రెండింగ్ వార్తలు